కదిలే నదిలా సాంగ్ లిరిక్స్ అందించినవారు సాగర్ నారాయణ, సుభాష్ ఆనంద్ సంగీతా సమర్పణలో నారాయణ నాయర్ ఆలపించిన ఈ పాట ‘గీత‘ చిత్రంలోనిది.

కదిలే నదిలా సాంగ్ క్రెడిట్స్

Movie Geetha (2022)
Director Viswa(R)Rao
Producer R Rachiah
Singer Narayana Nair
Music Subhash Anand
Lyrics Sagar Narayana
Star Cast Hebba Patel, Gautham
Music Label & Source

కదిలే నదిలా సాంగ్ లిరిక్స్ ఆంగ్లములో

Kadhile Nadhila Nee Kadha
Payanam Etuke Anthalaa
Aakashamantha Manase
Ee Vishwamantha Pariche
Premaga Nee Kalaa

Vilayaana Kodigatte Deepaalake
Samuralle Nee Saayam Andhenule
Poddhe Podupe Leni Aa Kallalo
Prabhavinchina Ventane

Aakashame Nee Aashayam
Aanandhame Nee Santhakam
Kadhile Nadhila Nee Kadha
Payanam Etuke Anthalaa

Watch కదిలే నదిలా Video Song


కదిలే నదిలా సాంగ్ లిరిక్స్ తెలుగులో

కదిలే నదిలా నీ కధా
పయనం ఎటుకే అంతలా
ఆకాశమంత మనసే
ఈ విశ్వమంతా పరిచే
ప్రేమగా నీ కలా

విలయాన కొడిగట్టే దీపాలకే
సమురల్లే నీ సాయం అందేనులే
పొద్దే పొడుపే లేని ఆ కళ్ళలో
ప్రభవించిన వెంటనే

ఆకాశమే నీ ఆశయం
ఆనందమే నీ సంతకం
కదిలే నదిలా నీ కధా
పయనం ఎటుకే అంతలా

మౌనం చేసే గీతాలాపం
మమతేనంట తన సందేశం
ఏ జన్మదో ఈ సుకృతం

మీతోటి ఈ అమ్మ కలిసెనే పండుగై ఇలా
గుండెల్లో గాయాలు తుడిచెనే తల్లిగా
సీతాకోకచిలుకల గుంపే టెన్ టు ఫైవ్
ఏకమైనా ఓ లోకం ఇదే
వేల సైన్యమై నీకు కావలై
గీత కాపు కాచెనే, తొలిగిపోవు బాధలే

కదిలే మదిలే తన కధే
పయనం ఎపుడూ ఆపదే

ఎవరే పాపం పసివాళ్ళంతా
ఎందుకు చేరే నీ చుట్టూత
ఏమున్నదే నీ చెంతలో
ఒక్కొక్క చినుకొచ్చి వాలిన
నదివి నీవుగా
చేసావు సరికొత్త సాగునే పుడమిపై

గరళం మింగి అమృతమిచ్చే
ప్రేమేనంట నీ సన్నిదే
పడమటి నుండి పొడిచే తొలిపొద్దు
నీవేగా ఓ ప్రాణమా… నీ జన్మ చరితార్ధమే
కదిలే నదిలే నీ కధే
పయనం ఎపుడూ ఆపకే