ఈరోజు నుండి తెలంగాణాలో పేదల ఖాతాల్లో రూ.1500 జమ – నేరుగా బ్యాంకు అకౌంట్ కు బదిలీ

కరోనా విపత్తు, లాక్‌డౌన్ దృష్ట్యా పేదలకు నెలరోజులకు సరిపడే విధంగా 12 కిలోల ఉచిత బియ్యం మరియు ప్రతీ రేషన్ కార్డుకు రూ.1500/- నగదు రూపేణా ఇస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు బియ్యం మాత్రమే పంపిణి చేయగా ఈరోజు నుండి డబ్బు బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది.

తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి మంగళవారం తమ బ్యాంకు ఖాతాలో రూ.1500 జమ చేస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి హామీ మేరకు డబ్బులు ఎలా ఇవ్వాలి మరియు పేదల బ్యాంకు ఖాతాల వివరాలు మొదలగు అంశాల మీద అధికారులు చర్చలు జరిపారు కెసిఆర్.

అయితే చాలా మంది బ్యాంకు వివరాలు ఇవ్వలేదు కదా మరి ఖాతాల్లో డబ్బులు ఎలా జమ చేస్తారు అనే సందేహం ఉంది. పౌర సరఫరాల శాఖ ఇప్పటికే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి ఆధార్ కార్డు ఆధారంగా వారి బ్యాంకు ఖాతాల సమాచారాన్ని సేకరించింది. 14 ఏప్రిల్ 2020 నుండి పేదలకు తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక సాయం రూ.1500 అందనుంది. దీని ద్వారా తెలంగాణలోని 74 లక్షల కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. ఇందుకోసం రూ.1,112 కోట్లను ప్రభుత్వం బ్యాంకులకు బదిలీ చేసే ప్రక్రియ కూడా ముగిసింది.