ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా మరణం – 1st Corona Death in AP

ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా మరణం

ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా మరణం

రాష్ట్రంలో మొదటి కరోనా మరణం నమోదైంది. విజయవాడకు చెందిన 55 సంవత్సరాల వ్యక్తి కరోనా బారిన పది మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఈరోజు (03.04.2020).

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, చనిపోయిన వ్యక్తి కుమారుడు మార్చి నెల 17న ఢిల్లీకి వెళ్ళి వచ్చాడు. అయితే మార్చి 30వ తేదీ నాడు ఉదయం 11:30 నిమిషాలకు విజయవాడ జనరల్ హాస్పిటల్ చెకప్ నిమిత్తం వెళ్లడం జరిగింది. చెకప్ కు వెళ్లిన గంట తరవాత 12:30 నిమిషాలకు చనిపోయాడు.

వారు హోపిటల్ కు వచ్చిన వెంటనే స్వాప్ తీసుకొని టెస్టుల కోసం పంపించారు. మార్చి 31నాడు వారి రిపోర్టు రావడం అందులో కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. చనిపోయిన వ్యక్తికి హైపర్ టెన్షన్, డయాబెటిస్ లతో బాధపడుతున్నాడు.

మృతునికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉండడంతో కరోనా వైరస్ వల్ల చనిపోయాడని ఖచ్చితంగా నిర్దారించుకున్న తరువాతే మరణంకు సంబంధించి ప్రకటన చేయడంలో జాప్యం జరిగిందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన కుమారుడికి వైరస్ సోకడం వల్లే తండ్రికి పోసిటివ్ వచ్చింది. అలాగే అతనికి కాంటాక్ట్ లో ఉన్న 29 మందిని గుర్తించి క్వారంటైన్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు.