స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అల..వైకుంఠపురములో’ సినిమా కేవలం విడుదలైన పదిరోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.220 కోట్ల గ్రాస్ రాబట్టిందని, ఇది ఆల్ టైమ్ (నాన్ బాహుబలి-2) రికార్డని తెలిపారు.
సినిమా రెండో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకువెళ్తోంది. అలాగే రూ.143 కోట్ల షేర్స్ రాబట్టినట్లు తన ట్విట్టర్ ఖాతా ద్వార తెలిపింది గీతా ఆర్ట్స్.
ఏరియాల వారిగా చూస్తే పదిరోజుల వసూళ్లు (విశ్లేషకుల అంచనా) క్రింది విధంగా ఉన్నాయి.
- తెలుగు రాష్ట్రాల్లో – రూ.112.90 కోట్లు
- నిజాం – రూ.35.69 కోట్లు
- సీడెడ్ – రూ.18.07 కోట్లు
- వైజాగ్ – రూ.18.80 కోట్లు
- గుంటూరు – రూ.9.93 కోట్లు
- తూర్పుగోదావరి – రూ.9.89 కోట్లు
- పశ్చిమ గోదావరి – రూ.7.65 కోట్లు
- కృష్ణా – రూ.8.80 కోట్లు
- నెల్లూరు – రూ.4.07 కోట్లు
- కర్ణాటక – రూ.10.70 కోట్లు