సీఎం జగన్‌కు కరోనా పరీక్షలు – రాపిడ్‌ టెస్ట్‌ కిట్‌ ద్వారా టెస్టులు

సీఎం జగన్‌కు కరోనా పరీక్షలు

సీఎం జగన్‌కు కరోనా పరీక్షలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వచ్ఛందంగా ఈరోజు 17 ఏప్రిల్ 2020 నాడు కోవిడ్‌-19 (కరోనా) టెస్ట్‌ చేయించుకున్నారు. దక్షిణ కొరియా నుంచి లక్ష రాపిడ్‌ టెస్ట్‌ కిట్లు తెప్పించిన అనంతరం సీఎం జగన్‌ కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

సీఎం జగన్‌కు కరోనా పరీక్షలు

వైద్యులు చేసిన ఈ పరీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నెగెటివ్‌గా నిర్థారణ అయింది. ఈ రోజు మధ్యాహ్నమే సౌత్ కొరియా నుండి లక్ష రాపిడ్‌ టెస్ట్‌ కిట్లు ఏపీ కి చేరుకున్నాయి. వీటి ద్వారా కేవలం 10 నిమిషాల్లో కరోనా పరీక్ష ఫలితం వస్తుంది.

తొలి రాపిడ్ టెస్టు ద్వారా జగన్ పరీక్షలు చేయించుకున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ కిట్ల ద్వారా ఇక రాష్ట్రంలో కరోనా పరీక్ష ఫలితాలు త్వరగా రావడమే కాకుండా వీలైనంతవరకు ఎక్కువ మందికి టెస్టులు చేయనుంది ప్రభుత్వం.

Also Read: Today Gold Price

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.