ఏపీ ఎంసెట్ ఈసెట్ ఐసెట్ పరీక్ష తేదీలు విడుదల – దరఖాస్తు గడువు పెంపు

ఏపీ ఎంసెట్ ఈసెట్ ఐసెట్ పరీక్ష కొత్త తేదీలు విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఎంసెట్, ఈసెట్, ఐసెట్తో సహా అన్ని ఉమ్మడి పరీక్షల తేదీలను విడుదల చేసింది విద్యామండలి.

లాక్‌డౌన్ ముగిసిన వెంటనే పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమైంది. అలాగే ఎంసెట్, ఈసెట్, ఐసెట్, లాసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీ సెట్‌ మొదలగు పరీక్షలకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఉంటె మే 20 వరకు ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. హేమచంద్ర రెడ్డి తెలిపారు.

ఏపీ ఎంసెట్ ఈసెట్ ఐసెట్ పరీక్ష కొత్త తేదీలు

ఎంసెట్‌: జులై 27 నుంచి 31 వరకు

ఈసెట్‌: జులై 24న

ఐ-సెట్ : జులై 25న

పీజీ సెట్: ఆగస్ట్‌ 2 నుంచి 4 వరకు

ఎడ్ సెట్: ఆగస్టు 5న

లా-సెట్: ఆగష్టు 6న

పీఈసెట్‌: ఆగష్టు 7 నుంచి 9 వరకు

Amazon Deals