Home » తాజా వార్తలు » ఆంధ్రప్రదేశ్ మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ – సీఎం జగన్ ప్రెస్ మీట్ 22.03.2020

ఆంధ్రప్రదేశ్ మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ – సీఎం జగన్ ప్రెస్ మీట్ 22.03.2020

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుంబిగించింది. 31 మార్చి 2020 వరకు ఏపీ లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నట్టు సీఎం జగన్ చెప్పారు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తక్కువ, దేశంలో భయానక పరిస్థితులు ఉన్నా రాష్ట్రం సురక్షిత స్థానంలో ఉండడానికి పాటుపడిన వాలంటీర్ లకు, హెల్త్ డిపార్టుమెంటు మొత్తానికి, అధికారులు మిగతా అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ మార్చి 31 వరకు లాక్‌డౌన్‌

ఏపీ లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయి. మిగతా అన్నీ సేవలు నింపివేయడం జరుగుతుంది. ప్రతీ నియోజకర వర్గంలో ఐసోలేషన్ నిమిత్తం 100 పడకలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గొంతు నొప్పి, జ్వరం, జలుబు వంటివి ఉంటె వెంటనే 104 నెంబర్ కు ఫోన్ చేయాలని రాష్ట్ర ప్రజలను కోరారు జగన్.

అన్ని రకాల విద్యాసంస్థలు అన్నీ మూసివేయడం జరిగింది 31 మార్చి 2020 వరకు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలి. పదిమంది కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దు. పొలం పనులకు వెళ్తే 2 మీటర్ల దూరం ఉండాలి.

  • ప్రజా రవాణాను పూర్తిగా నింపివేయడం జరుగుతుంది.
  • పడవ తరగతి పరీక్షలు యథాతథంగా జరగనున్నాయి.
  • అంతరాష్ట్ర సరిహద్దులు మూసివేస్తున్నాము.
  • ఈ నెల 29నే రేషన్ సరుకుల పంపిణీ.
  • రేషన్ బియ్యంతో పాటు కిలో పప్పు ఉచితంగా అందిస్తారు.
  • రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి ఏప్రిల్ 4న రూ.1000 అందిస్తారు.

Also Read: Telangana lo march 31 varaku lockdown

Scroll to Top