AP పాలిసెట్ నోటిఫికేషన్ 2020 కు సంబంధించి ముఖ్యమైన తేదీలు విడుదలయ్యాయి. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్
అండ్ ట్రైనింగ్ (SBTET), ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ పూర్తి స్థాయి నోటిఫికేషన్ మర్చి1, 2020న విడుదల చేస్తుంది. ఇప్పటికే
ప్రిపరేషన్ మొదలుపెట్టి నోటిఫికేషన్ కోసం ఎదురు చేస్తున్న అభ్యర్థులకు ఇది శుభవార్త.
AP పాలిసెట్ నోటిఫికేషన్ 2020 ఎప్పుడు
మర్చి1, 2020న SBTET ఉన్నత అధికారులు AP పాలిసెట్ 2020 సంవత్సరానికి గాను పూర్తి స్థాయి వివరాలతో ప్రకటనను విడుదల చేస్తుంది. దరఖాస్తు ప్రక్రియ 05 మార్చి 2020 నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి, అభ్యర్థులందరూ ఏప్రిల్ 18 2020వరకు దరఖాస్తు ఫారమ్ ఆన్ లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది.
AP పాలిసెట్ 2020 పరీక్ష ఎప్పుడు ?
ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎపి పాలిసెట్ 2020) పరీక్ష ఏప్రిల్ 28, 2020 తేదీన జరుగుతుంది.
AP పాలిసెట్ 2020 దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు
- దరఖాస్తు చేసే అభ్యర్థి తప్పనిసరిగా భారతీయుడై ఉండాలి.
- అభ్యర్థులు ఎస్.ఎస్.సి (10వ తరగతి) ఉత్తీర్ణులై ఉండాలి.
- అభ్యర్థి విధిగా 15 సంవత్సరాలు నిండి ఉండాలి.
AP పాలిసెట్ 2020 ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ విడుదల తేదీ: 01 మార్చి 2020
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 05 మార్చి 2020
- దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 18 ఏప్రిల్ 2020
- హాల్ టిక్కెట్టు విడుదల తేదీ: ఏప్రిల్ 3 వ వారంలో ఉండొచ్చు
- పరీక్ష తేదీ: 28 ఏప్రిల్ 2020
- ఫలిత విడుదల: తేదీ 07 మే 2020 (అనధికారికం)
AP పాలిసెట్ 2020 నోటిఫికేషన్ డౌన్‌లోడ్ కొరకు: ఇక్కడ క్లిక్ చేయండి (లింక్ 01 మార్చి 2020 నుండి అందుబాటులోకి వస్తుంది)