ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపు – ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఉద్వాసన పలికింది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబందించి కమిషనర్ ను తొలగిస్తూ జీవో జారీచేసింది. ఎన్నికల కమిషనర్ నియామక నిబంధనల మార్పు ఆర్డినెన్సుకు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఆ వెంటనే ఆర్డినెన్సు పై జీవో ను జారీ చేసింది ప్రభుత్వం.

ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపు

అయితే ఈ ఆర్డినెన్సు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ తీసుకొచ్చింది. కాబట్టి ఈ నిబంధనల ప్రకారం రమేష్ కుమార్ పదవీకాలం ముగిసినట్టయింది. కమిషనర్ ను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కీలకమైంది. ఇలా ఒక ఎన్నికల అధికారిని ఈ విధంగా తొలిగించిన చరిత్ర లేదనే చెప్పాలి. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది.

రాష్ట్రంలో స్థానిక సంస్థల నేపధ్యంలో ఒక పక్క ఏకగ్రీవాలు జరుగుతుండగా, నామినేషన్ ప్రక్రియ కూడా జరుగుతున్న సమయంలో ఎవరినీ సంప్రదించకుండా ఏకగ్రీవంగా ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు, ఇదంతా ఒక సామాజిక వర్గంకు అనుకూలంగా తీసుకున్న ఏకపక్ష నిర్ణయం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

ఇందుకు సంబంధించిన 3 జీవోలు కూడా గోప్యతగా ఉంచారు. ఈ మూడు జీవోలు ఒకటి న్యాయ శాఖ నుండి వచ్చిన జీవో నెం. 31, పంచాయతీ రాజ్ మరియయు గ్రామీణాభివృద్ధి శాఖ జీవో నెం. 617, 618.

ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపు – వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *