APSRTC Apprentice 2020 Jobs. ఏపీఎస్‌ఆర్‌టీసీలో దాదాపు 5,000 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. డీజిల్ మెకానిక్, వెల్డర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, షీట్ మెటల్ వర్కర్ మొదలగు అప్రెంటిస్ ఖాళీలు 5000 పైనే ఉన్నాయి.
అర్హులైన మరియు అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. 21 మార్చి 2020 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ 09 ఏప్రిల్ 2020న జరుగుతుంది. మరియు ఎంపికైన అభ్యర్థుల జాబితా 13 ఏప్రిల్ 2020న వెలువడుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి – ఖాళీల వివరాలు – APSRTC Apprentice 2020 Jobs
- ఆసక్తి ఉన్న అభ్యర్థులు మొదట https://apprenticeship.gov.in/ ఈ వెబ్ సైట్ ను సందర్శించాలి.
- Establishment పేజీకి వెళ్లి అందులో Establishment Search లోకి వెళ్ళాలి.
- తరువాత Establishment Name సెక్షన్ లో APSRTC అని టైపు చేసి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ ను ఎన్నుకొని సెర్చ్ చేయాలి.
- ఇప్పుడు మీకు వేరే పేజీలో ఖాళీల వివరాలు మరియు అప్లై చేసుకోవడానికి లింక్ కనిపిస్తుంది.
- జాగ్రత్తగా అన్నీ పరిశీలించి అప్లై చేసుకోగలరు.
అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటె క్రింద కామెంట్ ద్వారా తెలియజేయగలరు.
అభ్యర్థులు విధులు నిర్వర్తించాల్సిన రీజియన్, వర్క్‌షాప్‌ల కేటాయింపు 15 ఏప్రిల్ 2020న వెలువడిస్తారు.
ఇది కూడా చదవండి: మిధానిలో జాబ్ కొరకు అప్లై చేయండి