Betaal Official Trailer Out – దడ పుట్టిస్తున్న ‘బేతాళ్’ నెట్‌ఫ్లిక్స్ సిరీస్

Betaal Official Trailer
Pic Credit: Netflix (YouTube)

Betaal Official Trailer Out. బాలీవుడ్ బాద్ షా షారుక్‌ ఖాన్ యొక్క రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సహ నిర్మాణ సారథ్యంలో వస్తున్న నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘భేతాళ్’ ట్రైలర్ విడుదలైంది. హారర్ నేపథ్యంలో వస్తున్న ఈ సీరీస్ మే 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చూస్తుంటే ఆధ్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తుంది.

‘బేతాళ్’ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ లో వినీత్ కుమార్, అహ‌నా కుమ్రా, సుచిత్ర పిళ్లై, జితేంద్ర జోషి మొదలగు వారు కీలక పాత్రల్లో నటించారు. ప్యాట్రిక్ గ్రాహం, నిఖిల్ మ‌హాజ‌న్ లు దర్శకత్వం వహించారు.

కథలోకి వెళ్తే… కంపా అటవీ సమీప గ్రామ ప్రజలను అక్కడినుండి తరలించి హైవే నిర్మించడానికి సన్నాహాలు చేస్తారు. అందుకు అక్కడి గ్రామస్థులు తమ నాగరికతను నాశనం చేస్తే భేతాళ్ పర్వతం యొక్క శాపానికి గురవుతారని, దానికి విమోచన లేదని చెప్పడం, వెంటనే ఆర్మీ రంగంలోకి దిగడం జరుగుతుంది. అయితే రెండు శతాబ్దాల క్రితం చ‌నిపోయిన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ అధికారి తన జాంబీ సైన్యంతో, కౌంట‌ర్ ఇన్‌స‌ర్జెన్సీ పోలీస్ డివిజ‌న్ (సీఐపీడీ) పోరాడి ఎలా మట్టు పెడుతుందనేదే కథాంశం.

ప్రముఖ స్ట్రీమింగ్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ప్రపంచంలోని 190 కి పైగా దేశాలలో 183 మిలియన్ ప్రీమియం సభ్యత్వాలతో టీవీ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు మరియు చలన చిత్రాలతో పాటు అనేక రకాల కళా ప్రక్రియలు వివిధ భాషలలో అందిస్తుంది.

Watch Betaal Official Trailer