నితిన్ తన తాజా చిత్రం ‘భీష్మ’ ట్రైలర్ ఈరోజు (17/02/2020)న విడుదల చేసింది చిత్ర బృందం. దుర్యోధనుడు, దుశ్శాసన, ‘ధర్మరాజు, యమధర్మరాజు, శని, శకుని ఇలా పురాణాల్లో ఇన్ని పేర్లు ఉండగా పోయి పోయి ఆ జన్మ బ్రహ్మచారి భీష్మ పేరు పెట్టారు నాకు.. దాని వల్లేనేమో ఒక్కరూ కూడా పడటం లేదు’ అంటూ తన నిరాసక్తను తెలియజేస్తూ చెప్పిన డైలాగుతో ట్రైలర్‌ మొదలవుతుంది. చివర్లో వచ్చే డైలాగు మరియు విలన్ చెప్పే డైలాగ్ ‘బలవంతుడితో పోరాడి గెలవచ్చు, అదృష్టవంతుడితో గెలవలేం’ ఆకట్టుకుంటాయి.

రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘భీష్మ’ చిత్రంలో నితిన్ కు జోడీగా రష్మిక నటించింది. సినిమా వ్యవసాయం నేపథ్యంలో నిర్మించినట్టు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సింగల్ ఆంథెమ్, వాట్ ఏ బ్యూటీ పాటలు అలరిస్తున్నాయి.

సూర్యదేవర నాగ వంశీ నిర్మాణ సారథ్యంలో పీడీవీ ప్రసాద్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వస్తున్న ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకుడు. మహతి స్వర సాగర్‌ స్వరాలు అందించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తుంది భీష్మ.

Read Also: నితిన్ సింగల్స్ ఆంథెమ్ వీడియో