నితిన్, రష్మిక నటించిన భీష్మ సినిమా ఈ శుక్రవారం విడుదలకు సిద్ధమవుతుండగా మరియు ప్రీమియర్ షోకు ఒక్కరోజు
ముందు సినిమా విడుదలకు కష్టాలు వచ్చాయి. బీజేపీ పార్టీ ధార్మిక సెల్ కన్వీనర్ తుములూరి శ్రీ కృష్ణ చైతన్య, ప్రిన్సిపల్
సెక్రటరీ రాము ‘భీష్మ’ టైటిల్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

నితిన్ భీష్మ చిత్రం విడుదలకు ఆటంకాలు

మహాభారతంలో గొప్ప వ్యక్తిత్వం ఉన్న భీష్మ పితామహుడు వంటి యోధుని పేరును ఒక సినిమాకు ఉపయోగించడం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వారు ఆరోపించారు.

భీష్మడు జీవితాంతం బ్రహ్మచారి, కానీ ఈ చిత్రంలో నితిన్ హీరోయిన్ సరసాలు, ముద్దుపెట్టుకోవడం మరియు ప్రేమించడం వంటివి
చేయడం భీష్ముణ్ని అవమానించడం ఏంటని ప్రశ్నిస్తూ, టైటిల్‌ను వెంటనే మార్చాలి లేకుంటే సినిమాను థియేటర్లలో అడ్డుకుంటామని బిజెపి నాయకులు ‘భీష్మ’ నిర్మాతలను డిమాండ్ చేశారు.

ఈమధ్య ఇలానే వరుణ్ తేజ్ వాల్మీకి చిత్ర పేరున విషయంలో ఆటంకాలు వచ్చిన నేపథ్యంలో దర్శకుడు హరీష్ శంకర్ ‘గద్దలకొండ గణేష్’ గా రాత్రికి రాత్రే మార్చిన విషయం తెలిసిందే. మరి భీష్మ చిత్ర దర్శకుడు వెంకి కుడుముల మరియు మేకర్స్ టైటిల్ ను మారుస్తారో లేదో తెలుస్తుంది కొన్ని గంటల్లో.

ఇది కూడా చదవండి: జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రం