Bigg Boss Telugu 4 Teaser. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 త్వరలో ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన టీజర్ ను మా టీవీ ఈరోజు విడుదల చేసింది.
టీజర్లో నాగార్జున తాత, తండ్రి మరియు కొడుకులుగా మూడు గెటప్ లలో కనిపించి అలరించారు. అతి త్వరలో ప్రసారం కానున్న షో టీజర్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు నిర్వాహకులు.
Bigg Boss Telugu 4 Teaser
‘మై డియర్ ఇంటి సభ్యుల్లారా… ఇంతకన్నా వంద రెట్ల బెటర్ ఎంటర్‌టైన్‌మెంట్ నేను సెట్ చేస్తా. తియ్యండి రిమోట్లు, ఫిక్స్ అవ్వండి బిగ్ బాస్… నిజమైన ఎమోషన్స్, అసలైన ఎంటర్‌టైన్‌మెంట్… ఇక్కడంతా లైవ్… వాట్ ఎ వావ్, వావ్… బిగ్ బాస్ సీజన్ 4, ఎంటర్‌టైన్‌మెంట్ లైక్ నెవర్ బిఫోర్’ అంటూ నాగార్జున టీజర్ ద్వారా చెప్పుకొచ్చారు.
నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ రియాల్టీ షోలో పాల్గొనే వారికి కరోనా పరీక్షలు చేసి క్వారంటైన్ లో ఉంచనున్నారు. అభ్యర్థులు ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకున్నాకే బిగ్ బాస్ ఇంట్లోకి పంపించనున్నారు. ఈసారి బిగ్ బాస్ నిర్వాహకులు పకడ్బందీగా కోవిడ్-19 నింబంధనలకు అనుగుణంగా నిర్వహించడమే కాకుండా, ఈసారి వారు నిర్వహించే టాస్కులు ఆసక్తికరంగా ఉండనున్నాయి. భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించనున్న టాస్కులు ప్రేక్షకులను ఎంతవరకు అలరించనున్నాయి చూడాలి.
మొత్తం 16 మంది పాల్గొనే ఈ సీజన్ ఎన్ని రోజులు జరుగుతుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే 70 రోజులు మాత్రమే షో నిర్వహించే యోచనలో నిర్వాహకులు ఉన్నట్టు సమాచారం.