బిగ్ బాస్ 4 లోగో లాంచ్ టీజర్ – Telugu Bigg Boss 4 Coming Soon

1
బిగ్ బాస్ 4 లోగో లాంచ్ టీజర్
Pic Credit: Star Maa (YouTube)

బిగ్ బాస్ 4 లోగో లాంచ్ టీజర్ 15 సెకండ్ల నిడివితో విడుదల చేసింది స్టార్ మా. కరోనా వైరస్ కారణంగా ఈసారి బిగ్ బాస్ తెలుగు షో నిర్వహిస్తారో లేదో అనే అనుమానాలకు స్వస్తి పలుకుతూ ప్రోమో విడుదల అయింది.

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వేచిచూస్తున్న తెలుగులో అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 అతి త్వరలో టెలికాస్ట్‌కి రెడీ అయ్యింది.బిగ్ బాస్ సీజన్ 1, 2 మరియు 3కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈసారి కూడా ప్రేక్షకులను రంజింపజేయడానికి సరికొత్త హంగులతో ముందుకు రానుంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఎప్పటినుండి ప్రసారం కాబోతుందో అని ఎదురుచూస్తుండగా సీజన్ 4 లోగో ప్రోమోను అధికారికంగా విడుదల చేసింది స్టార్ మా టీవీ.

15 సెకండ్ల నిడివి గల ఈ టీజర్లో షో ఎప్పటి నుండి ప్రసారం అవుతుంది ? హోస్ట్ ఎవరు ? కంటెస్టెంట్స్ ఎవరు లాంటివి బహిర్గతం చేయకుండా కేవలం షో త్వరలో మొదలవుతుంది అని మాత్రం ఒక హింట్ ఇస్తూ లోగో డిజైన్ చేశారు నిర్వాహకులు.

ఈసారి కూడా నాగార్జున హోస్ట్..!

సీజన్ 4కి హోస్ట్‌గా కింగ్ నాగార్జున దాదాపు ఖాయం అయ్యారు. సీజన్ 3 ని విజయవంతంగా హోస్ట్ చేసిన నాగ్ ఈసారి కూడా తన భాధ్యతను నిర్వర్తించనున్నారు.
2017 జూలై 1న బిగ్ బాస్ మొదటి సీజన్ ప్రారంభం అవగా ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించారు. 2018 జూన్‌ 10న ప్రారంభమైన రెండవ సీజన్ ను నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశారు.

కోవిడ్-19 మార్గదర్శకాలను పాటిస్తూ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్ లో దాదాపుగా 250 మంది సిబ్బంది ఏర్పాట్లు పూర్తి  చేసే పనిలో ఉన్నారు. కరోనా వైరస్ కారణంగా ఈసారి నిర్వహిస్తున్న బిగ్ బాస్ మార్గదర్శకాలు మారే అవకాశం ఉంది. ఇంకా షో ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

బిగ్ బాస్ 4 లోగో లాంచ్ టీజర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here