వరంగల్ జిల్లా పరకాల బస్ స్టేషన్ లో ‘ఫిదా’ హీరోయిన్ సాయి పల్లవి బస్సు కోసం బస్ స్టాండ్ లో అక్కడే
ఖాళీగా ఉన్న బెంచ్ మీద కూర్చొని ఉన్నా ఎవ్వరూ గుర్తుపట్టలేదు.

పరకాలలో తన తాజా చిత్రం ‘విరాటపర్వం’ షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ లో భాగంగా అక్కడ బస్
స్టాప్ లో బస్సు ఎక్కే సన్నివేశాన్ని కొంత దూరం లో ఉన్న హోటల్ లో కెమెరా పెట్టి చిత్రీకరిస్తున్నారు.

సాయి పల్లవి బల్ల మీద నుండి భుజానికి బ్యాగ్ వేసుకొని బస్ కోసం వెళ్తున్న సన్నివేశాన్ని కొందరు వీడియో తీశారు.

రాణాకు జంటగా సాయి పల్లవి నటిస్తున్న ‘విరాట పర్వం’ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు.