హైదరాబాద్ లోని చైతన్య పురిలోని గణేష్‌పురి కాలనీలో వెళుతున్న ట్రాక్టర్ సృష్టించిన భీభత్సానికి ఒక కారు, అయిదు బైకులు ధ్వంసం అయ్యాయి. ఒకరికి గాయాలయ్యాయి. భవన నిర్మాణ వ్యర్థాలతో వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి ఇంటి ముందు పార్క్ చేసిన పలు వాహనాల మీదకు దూసుకుపోయింది.

ట్రాక్టర్ డ్రైవర్ ఎగిరి రోడ్డు పక్కన ఒక ఇంటి ముందు పడిపోగా అదే ట్రాక్టర్ మీద కూర్చున్న మరొక వ్యక్తి గట్టిగా ట్రాక్టర్ ను పట్టుకొని ఉండడంతో అతనికి ఏమీ కాలేదు.

అయితే డ్రైవర్ కు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చినట్టు తెలుస్తుంది. అదుపు తప్పిన ట్రాక్టర్ పై నుండి కిందపడి కొట్టుకున్నాడు. ట్రాక్టర్ బీభత్సాన్ని గమనించిన అక్కడే ఆడుకుంటున్న బుడ్డోడు ఇంట్లోకి పరుగు తీయడంతో పెద్ద గండం తప్పింది.

డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

Also Read: ఔచిత్యం చాటిన కేసీఆర్‌