గోపిచంద్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న మరో యాక్షన్ చిత్రం ‘చాణక్య’. ఈ చిత్ర ట్రైలర్ ను ఈరోజు చిత్ర బృందం విడుదల చేసింది. మెహరీన్, జరీన్‌ఖాన్ కథానాయికలుగా నటిస్తున్నారు.
ట్రైలర్ చూస్తుంటే భారీ యాక్షన్ సన్నివేశాలతో సినిమాను రూపొందించినట్టు తెలుస్తుంది. గోపీచంద్ సీక్రెట్ ఏజెంట్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తిరు దర్శకత్వం వహిస్తున్నాడు.
రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ‘చాణక్య’ చిత్రానికి ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చుతుండగా వెట్రి పలనిస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది ‘చాణక్య’ చిత్రం.