కరోనా వైరస్ వస్తే ఆల్ ది బెస్ట్ చెప్తూ వీడియో చేసిన ఛార్మి – నెటిజన్ల విమర్శలు, క్షమాపణలు కోరి వీడియో డిలీట్

కరోనా వైరస్ తో ఓ పక్క ప్రపంచం వణుకుతుంటే నటి చార్మీకి మాత్రం సంతోషమేసినట్టుంది. కోవిడ్ 19 భారత్ లో ఇద్దరికీ
సోకినట్టు భారత ఆరోగ్య శాఖ ధ్రువీకరించిన విషయం విధితమే. ఇదే విషయమై నటి చార్మీ ఒక టిక్ టాక్ వీడియో చేసింది. ఆ
వీడియోలో “అల్ ద బెస్ట్ గయ్స్.. యు నో వై.. కరోనా వైరస్ హ్యస్ రీచ్డ్ ఢిల్లీ అండ్ హైదరాబాద్ అంటా, ఇప్పుడే ఈ వార్త
విన్నాను.. అల్ ద బెస్ట్” అని తెగ నవ్వుతూ చెప్పింది.

ఆల్ ద బెస్ట్ ఏంటి, ఆ నవ్వుతూ సంతోషంగా చెప్పడమేంటి. ఆమె ఏ ఉద్దేశ్యంతో వీడియో తీసింది, ఆ వీడియో ద్వారా ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంది, మరి తనకైనా అర్థమైందో లేదో కానీ నెటిజన్స్ కి మాత్రం చిర్రెత్తింది. ఒక్కసారిగా ఇష్టం వచ్చిన రీతిలో కామెంట్స్ చేసి మరీ ట్రోల్ చేశారు చార్మీని.

కరోనా భయంతో ప్రజలు భయాందోళనలో ఉంటే బాధ్యతగా వ్యవహరించాల్సిన మీలాటి వారే ఇలా ప్రవరిస్తూ సమాజానికి ఏలాంటి
సందేశాన్ని ఇద్దామనుకుంటున్నారు చార్మీ గారు. మీలాంటి వాళ్ళు సహాయం చేయాలి. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అంతే కానీ ఇలా ప్రవర్తించడం సరికాదు అని నెటిజన్లు చురకలంటించారు.

క్షమాపణలు కోరిన చార్మీ

చార్మీ చేసిన పొరపాటును గ్రహించి వెంటనే వీడియో తొలగించి, క్షమాపణలు కోరింది. ఇకపై జాగ్రత్తగా ఉంటాను ఏదైనా పోస్ట్ చేసే ముందు, ఆలోచించకుండా షేర్ చేశాను, కామెంట్స్ చూశా.. క్షమించండి అని తెలిపింది.