కరోనా వైరస్ కట్టడికి చిరంజీవి సూచనలు – ఏదో అయిపోతుందనే భయం, ఏదీ కాదనే నిర్లక్ష్యం వద్దు

ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులందరూ వైరస్ వ్యాప్తి చెందకుండా ఏలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయం మీద విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చిరంజీవి కూడా ఇందుకు సంబంధించి వీడియో ద్వారా వైరస్ కట్టడికి నిర్మూలన మార్గాలు చెప్పారు.

ఏదో అయిపోతుందనే భయం, ఏదీ కాదనే నిర్లక్ష్యం వద్దు

చిరంజీవి ఏమన్నారో చూద్దాం. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ కరోనా. మనకేదో అయిపోతుందన్న భయం కానీ, మనకు ఏదీ కాదు అనే నిర్లక్ష్యం కానీ, ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయమిది. జన సమూహానికి వీలైనంత దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితమవడం ఉత్తమం.

వ్యక్తిగతంగా మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  1. మోచేతి వరకు వీలైనన్ని సార్లు కనీసం 20 సెకండ్ల వరకు సబ్బుతో కడుక్కోవాలి.
  2. తుమ్మినా దగ్గినా కర్చీఫ్, టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం మరవద్దు.
  3. చేతిని కళ్ళకి, ముక్కుకి, నోటికి తగలకుండా చూసుకోండి.
  4. జ్వరం, దగ్గు, జలుబు అలసట వంటివి ఉంటె వెంటనే డాక్టరును సంప్రదించండి.

కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైనా ఉంది.

ఆ వీడియో మీరు చూసి సూచనలు పాటించండి.