సైరా టీజర్ విడుదల: స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’.
చిరంజీవి కథానాయకుడుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ ఈరోజు విడుదల చేశారు.
మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సైరా’ టీజర్ వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో మొదలైన టీజర్ ఆధ్యాంతం విజువల్ వండర్స్ తో ఆకట్టుకుంది.
ముఖ్యంగా చిరంజీవి లుక్ అదిరిపోయింది.
ముంబై వేదికగా దర్శకుడు మరియు చిత్ర యూనిట్ సైరా టీజర్ ను విడుదల చేశారు.
జాతీయ స్థాయిలో ట్రెండ్ తీసుకురావాలని ఈ ప్రయత్నం చేసినట్టు అర్థమవుతుంది.
కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై హీరో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
చిరంజీవి టైటిల్ రోల్ లో ముఖ్య పాత్ర పోషిస్తుండగా అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార, తమన్నా, జగపతిబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
అక్టోబర్ 2, 2019 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర బృందం కసరత్తు చేస్తుంది.