చిరంజీవి సైరా ట్రైలర్ వచ్చేసింది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి నటన ప్రధాన ఆకర్షణగా
నిలిచింది. నరసింహారెడ్డి సామాన్యుడు కాడు.. అతడు కారణ జన్ముడు.. అతనొక యోగి.. అతనొక యోధుడు.. అతడిని
ఎవ్వరూ ఆపలేరు అంటూ టైటిల్ రోల్ ను పరిచయం చేస్తూ ట్రైలర్  ప్రారంభమైంది.

ఈ భూమి మీద పుట్టింది మేము. ఈ భూమిలో కలిసేది మేము. మీకెందుకు కట్టాలి రా సిస్తు అంటూ ఆంగ్లేయుల మీద విరుచుకుపడుతూ చిరంజీవి చెప్పిన డైలాగ్ ట్రైలర్ కే హైలైట్ గా నిలుస్తుంది.

మహాత్మాగాంధి పుట్టినరోజు అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మరియు హిందీ భాషలో విడుదల కానుంది.