కరోనా ఎఫెక్ట్ తో డార్లింగ్ ప్రభాస్ మాస్క్ ధరించి దర్శనిమిచ్చాడు. హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్‌లో ముఖానికి మాస్క్ ధరించి తన 20వ సినిమా షూటింగ్ లో భాగంగా యూరప్ కి వెళ్తూ కెమెరా కంటికి చిక్కాడు. మాస్క్ తో ఉన్న ప్రభాస్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
చాపకింద నీరులా విస్తరిస్తూ ఇప్పటికే దాదాపు 80 దేశాలకు వ్యాపించిన కరోనా వైరస్ భారిన పడకుండా ఉండడానికి ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ నిమిత్తం థాయ్‌లాండ్ వెళ్లాల్సి ఉండగా అక్కడ వైరస్ ప్రభావం ఉండడంతో ప్రస్తుతానికి అది వాయిదా వేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
టాలీవుడ్ నటులతో పాటు బాలీవుడ్ నటులు కూడా కరోనా వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో ముఖానికి మాస్కులు ధరించి కనిపిస్తున్నారు. విజయ్ దేవరకొండ, సన్నీలియోనే, పరిణీతి చోప్రా, రణ్‌బీర్ కపూర్ తదితరులు మాస్కులతో దర్శనమిచ్చారు.
Prabhas Pics with mask at Hyd Airport.