తెలంగాణాలో 6కు చేరిన కరోనా మృతులు – ఆరుగురు ఢిల్లీ నుండి వచ్చిన వారే

తెలంగాణాలో 6కు చేరిన కరోనా మృతులు

తెలంగాణాలో 6కు చేరిన కరోనా మృతులు

కరోనా మహమ్మారికి తెలంగాణాలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. సోమవారం 30 మార్చి 2020న ఒక్కరోజే 5గురు కోవిడ్19 వైరస్ కు బలయ్యారు. చనిపోయిన వీరందరూ ఢిల్లీలో ఒక మత పరమైన ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారే. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంఓ అధికారిక ట్వీట్ ద్వారా తెలియజేసింది ప్రభుత్వం.

తెలంగాణాలో 6కు చేరిన కరోనా మృతులు

ఢిల్లీ నిజాముద్దీన్ పరిధిలోని మర్కజ్ లో మార్చి 13-15 తేదీల మధ్య మత పరమైన ప్రార్థనల్లో పాల్గొని వచ్చారు. చనిపోయిన వారి వివరాలు చూస్తే గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు, అపోలో ఆసుపత్రిలో ఒకరు, ఒకరు నిజామాబాద్ లో, ఒకరు గద్వాల్ లో చనిపోగా మొన్న ఒకరు గ్లోబల్ ఆసుపత్రిలో చనిపోయారు.

వీరి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని భావించిన ఆరోగ్య శాఖ ఢిల్లీ వెళ్లొచ్చిన వారు తమకు తాముగా వచ్చి విధిగా సమాచారాన్ని అధికారులకు అందించాలని అభ్యర్థించింది. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స కూడా అందిస్తుందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది. వారి గురించి ఎవరికి సమాచారం తెలిసినా సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరింది.

ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలో పలు రాష్ట్రాల నుండి చాలా మంది పాల్గొని ఉంటారని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నుండి కూడా ఢిల్లీకి వెళ్లొచ్చారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల నుండి ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు చేర్చింది. తెలంగాణాలో కూడా పలువురులు క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారు.

Also Read: TS Health Department Jobs Notification