Die-Hard Female Fan of Mahesh Babu Suicide. మహేష్ బాబు వీరాభిమాని అయిన 23 ఏళ్ల తమిళ
నటి పద్మజ చెన్నై లోని తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.
ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబుకు డై హార్డ్ ఫ్యాన్. మహేష్ అభిమానులకు తాను సుపరిచితురాలు. ప్రిన్స్ సినిమా
విడుదలైందంటే తాను చేసే హంగామా అంటా ఇంతా కాదు, చేతిలో కర్పూరం వెలిగించుకుని మహేష్ పై తన అభిమానాన్ని చాటింది.
అయితే పద్మజ చనిపోవడానికి కారణం ఆర్థిక సమస్యలతో పాటు గత కొన్నిరోజులుగా భర్త పవన్ (25) నుంచి విడిపోయి ఒంటరిగా చెన్నై లోని తిరువొట్టియూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటుంది. రెండు సంవత్సరాల కొడుకు బంధువుల దగ్గర ఉంటున్నాడు.
#RIPPADDUDHFM హ్యాష్ ట్యాగ్ పేరుతో ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది. తమ తోటి అభిమాని చనిపోవడంతో మహేష్ బాబు అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.