Errabelli Dayakar Vs Rajagopal Reddy. ఈరోజు (07.03.2020) అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుల మాటల యుద్ధం జరిగింది. అసలేం జరిగిందంటే…
కెసిఆర్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రా లేకుంటే కొన్ని ప్రాంతాలకే ముఖ్యమంత్రో అర్ధం అవడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవు, ప్రభుత్వానికి కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ పాలమూరు-రంగారెడ్డి మీద లేదు, పాత ట్యాంకులు పాత పైపులే మిషన్ భగీరథలో ఉన్నాయి నాతో వస్తే నీళ్లు ఎక్కడా రావడం లేదని నిరూపిస్తాను. విద్యుత్తు ప్రాజెక్టులు అనవసర భారం, ప్రజలు ఎక్కడ 24 గంటల కరెంటును కోరుకోవడం లేదు. ఇంకా పలు అంశాల మీద విమర్శలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
అయితే కోమటిరెడ్డి చేసిన ఆరోపణలను మొదట ప్రశాంత్ రెడ్డి తిప్పి కొట్టారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలను రాజగోపాల్ గారు కించపరుస్తున్నారు. రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో, అన్ని వర్గాల ప్రజలు కెసిఆర్ గారికి అండగా నిలిచారు అని ప్రశాంత్ రెడ్డి గారు అన్నారు.
ఆ తరువాత మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కోమటిరెడ్డి చేసిన ఆరోపణల మీద ఘాటుగా స్పందించారు. రాజగోపాల్ గారు ప్రజలల్ల తిరుగుతున్నాడా, రోడ్ల మీద తిరుగుతున్నాడో అర్ధం కావడం లేదు. నేనొక మిత్రుడిగా మీకు సలహా ఇస్తున్న, మాట్లాడేటప్పుడు ఓ అర్ధం పర్థం ఉండాలి. పోదాం పా, ఇప్పుడు పోదాం, ఏ జిల్లా కంటే ఆ జిల్లాకు. ఉరికిచ్చి ఉరికిచ్చి కొడ్తరు నిన్ను. ఏం మాట్లాడుతున్నవ్ అంటూ ఘాటుగా స్పందించారు ఎర్రబెల్లి.