కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి నుండి బయటికి వస్తే తప్పకుండా మాస్కు ధరించాల్సిందేనని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించింది.
తెలంగాణాలో ఇళ్ల నుండి బయటికి వస్తే మాస్క్ తప్పనిసరి
ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, ఒడిషా, యూపీ, జమ్మూ&కాశ్మీర్ లో కూడా మాస్కుల వాడకం తప్పనిసరి. ఇప్పుడు తెలంగాణాలో కూడా బయటికి వచ్చారంటే అలాగే విధుల్లో ఉన్న ఉద్యోగులు కూడా మాస్కులు ధరించాలి. ఇందుకు ఇళ్లలో తయారు చేసుకున్న క్లాత్ మాస్కులు వాడడానికి అనుమతి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇంట్లో తయారు చేసే మాస్కులు రెండు వరుసల్లో ఉంటె మంచిది.
కరోనా వ్యాధి లక్షణాలు కనబడనప్పటికీ వైరస్ సోకే అవకాశాలు ఉంటున్నాయని అధ్యయనాల్లో వెల్లడి కావడంతో మాస్కుల వినియోగం తప్పనిసరి చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం మీద నిషేధం విధించింది తెలంగాణ సర్కారు రెండు రోజుల క్రితం. ఇక మాస్కులు సగం సగం ధరిస్తే కుదరదని, పూర్తిగా నోరు ముక్కు కవర్ అయ్యేలా ఉండాలని ఉత్తర్వులో పేర్కొంది.
ఇంకా మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశంతో పాటు మాస్కులు ప్రభుత్వం సరఫరా చేసే అవకాశం చేసే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ రికగ్నైజ్డ్ కెమెరాల సహాయంతో తమ పరిధి దాటి అంటే మూడు కిలోమీటర్లు ధాటి దూరం వెళ్తున్న వారికి నేరుగా ఇంటికే చలాన్లు పంపిస్తున్నారు.
కాబట్టి మాస్క్ ఆన్ పాలసీ అమల్లో ఉంది కాబట్టి …. మాస్కు లేకుంటే రిస్కె…. జాగ్రత్త…
తెలంగాణాలో ఇళ్ల నుండి బయటికి వస్తే మాస్క్ తప్పనిసరి
పూర్తి ఆదేశాలు క్రింద చూడండి.
Also Read: తుమ్మితే సత్తిమిర అని ఒకటే ఉరుకుడు ఇగ