Gallu Gallu Ganapayya Song Lyrics penned & sung by Lallayile Mahesh, and music composed by Mahendhar Sriramula. Lord Ganapathi Telangana Folk DJ Song.
Gallu Gallu Ganapayya Song Credits
Lyrics | Lallayile Mahesh |
Music | Mahendhar Sriramula |
Singer | Lallayile Mahesh |
Category | Telangana Folk Song Lyrics |
Song Label |
Gallu Gallu Ganapayya Song Lyrics
నమః పార్వతి పతయే
హర హర మహాదేవ శంభో శంకర
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
జై బోలో గణేష్ మహారాజ్ కి, జై
అరె ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జెల మోత
మా బొజ్జా గణపయ్య నీకు గంటల మోత
ధనా ధనా ధనా ధనా డప్పుల మోత
మా దండీ గణపయ్య నీకు వేడుక వాట
అరెరె అరెరె అరెరె అరెరె అరెరె
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
నడుముకు నాగులు సుట్టినవాడా
కాళ్ళకు గజ్జలు కట్టి నువ్వు ఆడ రావా
మూషిక వాహనం ఎక్కి గణపతి దేవా
ముల్లోకాలన్నీ ఇక ఏలుకరావా
(అర్రె అర్రె అర్రె అర్రె)
అరె రావయ్య రావయ్య శ్రీ గణనాధ
సిద్ధి బుద్ధి సైత మా శ్రీ గణనాధ
ఏక దంతం ఏ గణనాధ
మా బాధలన్ని నువ్వు ఇక మాపగ రావా
దండిగా మండపాలు వేసినమయ్యా
బహు దండిగ పూజలు నీకు చేసేమయ్యా
అరె శివ శివః శంకరా శ్రీ గణనాధ
మా చిత్తమంతా నీ మీదే నిలిపినమయ్యా
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
అరె ఆది గణనాధ యంబాసుఖుడా
మా లంబోదరుడా నీకు దండాలయ్యా
ఉండ్రాళ్లు పాశం కుడుములు నీకు
ఎలక పండ్లు మారేడు పత్రీ నీకు
ఊరూరా పూజలు ఓ గణనాధ
ముక్కంటి తనుయుడా మా గణనాధ
నవరాత్రులు భక్తితోని కొలిసేమయ్యా
పిల్ల జెల్ల సల్లంగా సూడవయ్యా