తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ – సమ్మె కాలానికి జీతాలను విడుదల

ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 55 రోజులుగా చేసిన సమ్మె కాలానికి సంబంధించిన జీతాలను విడుదల చేసింది. ఇందుకు అవసరమైన రూ.235 కోట్లను విడుదల చేస్తూ తెలంగాణా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

డిసెంబర్ 1, 2019న సీఎం కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం (సమ్మె చేసిన కాలానికి కూడా జీతాలను ఇస్తామని) ఈరోజు (11 మార్చి 2020) ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని సమ్మె చేసిన కాలానికి సంబంధించిన జీతాలు బ్యాంకులో ఉందనుకోండని ఆరోజు కెసిఆర్ చెప్పారు.

అయితే సమ్మె కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న ఆర్టీసీ కార్మికుల కుటుంబీకులకు 8 రోజుల్లో వారి అర్హతకు తగ్గ ఉద్యోగం ఇస్తానని చెప్పిన మాట కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ నిలబెట్టుకున్నారు.

మొన్న ప్రకటించిన బడ్జెట్ లోను ఆర్టీసీ కోసం రూ.1000 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

tsrtc employees with KCR

Also Read: Corona Virus Precautions by TS Govt