భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు ముందు సత్తా చాటి జట్టులో పునరాగమనం కోసం 100% ఫిట్ గా ఉన్నట్టు నిరూపించుకున్నాడు. శుక్రవారం రిలయన్స్ కార్పొరేట్ పార్క్ లో జరిగిన డివై పాటిల్ టి 20 కప్‌లో రిలయన్స్ 1 తరుపున ఆడుతున్న హార్దిక్ పాండ్యా కేవలం 39 బంతుల్లో 8 ఫోర్లు 10 సిక్సర్లు సహాయంతో 105 పరుగులు చేశాడు.

బ్యాక్ సర్జరీ చేయించుకుని గత వారం పోటీ క్రికెట్‌కు తిరిగి వచ్చిన హార్దిక్, తన సిజ్లింగ్ ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు, 10 సిక్సర్లు కొట్టాడు. గ్రూప్-సి లో భాగంగా కాగ్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్ లో రిలయన్స్ 1 ఐదు వికెట్లకు 252 పరుగులు చేసింది. దాదాపు ఆరు నెలలు ఆటకు దూరంగా ఉన్న తరువాత తన ఫామ్ ను అందిపుచ్చుకోవడతో సంతోషాన్ని వెలిబుచ్చాడు హార్దిక్.

బ్యాక్ సర్జరీ జరిగిన తరువాత అతను ఆడిన రెండో మ్యాచ్ ఇది. సెంచరీ సాధించడమే కాకుండా 5 వికెట్లు తీసి అలిరౌండ్ షో ప్రదర్శించాడు హార్దిక్ పాండ్యా. ఈ మ్యాచ్ లో కాగ్ జట్టు కేవలం 151 పరుగులు మాత్రమే చేసి 101 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది.

చివరిసారిగా హార్దిక్ దక్షిణాఫ్రికాతో బెంగళూరులో గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన టీ 20 మ్యాచ్ లో ఆడాడు. మల్లి అదే జట్టుపై అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

మార్చి 12 నుండి ధర్మశాలలో ప్రారంభమయ్యే మూడు వన్డేల సీరీస్ లో భారత్ జట్టు దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. రెండో వన్డే మార్చి 15 న లక్నోలో, చివరిది మార్చి 18 న కోల్‌కతాలో జరుగుతుంది.

Watch Hardik Pandya 39 Ball Century Video – DY Patil T20