రాహుల్ గాంధీ స్వ‌లింగ సంప‌ర్కుడు అని విన్నాం

0
రాహుల్ గాంధీ స్వ‌లింగ సంప‌ర్కుడు
Pic Credit: ANI

రాహుల్ గాంధీ స్వ‌లింగ సంప‌ర్కుడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అఖిల భార‌తీయ హిందూ మ‌హాస‌భ అధ్య‌క్షుడు
స్వామీ చ‌క్ర‌పాణి. కాంగ్రెస్ పార్టీ సేవాద‌ళ్ బుక్‌లెట్‌లో మహాత్మా గాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సేకు మరియు హిందూ
మహాసభ సహ వ్యవస్థాపకుడు వినాయక్ దామోదర్ సావర్కర్ కు శారీరక సంబంధం ఉందని ఆరోపించిన నేపద్యంలో స్వామీ
చ‌క్ర‌పాణి ఘాటుగా స్పందిస్తు ‘మాజీ మహాసభ అధ్యక్షుడు సావర్కర్ జీపై చేసిన ఆరోపణలు హాస్యాస్పదమైనవి రాహుల్ గాంధీ కూడా స్వ‌లింగ సంప‌ర్కుడు అని మేము కూడా విన్నాం’ అన్నారు.

అసలు కాంగ్రెస్ ఏమంది

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కాంగ్రెస్ నిర్వహిస్తున్న అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ శిక్షణా శిబిరంలో ‘వీర్‌ సావర్కర్‌ కిత్నే వీర్‌?’ అనే శీర్షికతో ముద్రించిన బుక్‌లెట్‌ను గురువారం హాజరైన వలంటీర్లకు పంపిణీ చేసింది. సావర్కర్ మరియు గాడ్సేకు శారీరక
సంబంధం ఉందని. అలాగే, వినాయక్ దామోదర్ సావర్కర్ మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలపై అత్యాచారానికి హిందువులను ప్రోత్సహించారనిఈ బుక్లెట్ పేర్కొంది.

“రచయిత సాక్ష్యాల ఆధారంగా రాశారు. కానీ అది మాకు ముఖ్యం కాదు. ఈ రోజు మన దేశంలో, ప్రతి ఒక్కరికీ స్వప్రయోజనాలను కలిగి ఉండటానికి చట్టపరమైన హక్కు ఉంది” అని ఏఎన్నై వార్తా సంస్థకు తెలిపారు సేవా దళ్ జాతీయ అధ్యక్షుడు లాల్జీ దేశాయ్.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here