Idi Mallela Velayani Song Lyrics penned by Devulapalli Krishna Sastry Garu from Telugu movie ‘Sukha Dukhalu‘, music composed by SP Kodandapani Garu, and sung by P Suseelamma Garu.
Idi Mallela Velayani Song Credits
Sukha Dukhalu Cinema Released Date – 04 January 1968 | |
Director | I N Murthy |
Producer | P. Kameshwara Rao |
Singer | Susheela |
Music | SP Kodandapani |
Lyrics | Devulapalli Krishna Sastry |
Star Cast | Vanisri, Jayalalitha, Rama Krishna, Chandra Mohan |
Video Source |
Idi Mallela Velayani Song Lyrics in English
Oo Ho Oo Oo Oo Oooo
Idi Mallela Velayani
Idhi Vennela Maasamani
Thondarapadi Oka Koyila
Mundhu Koosindhi
Vindhulu Chesindhi
Kasire Endalu Kaalchunani
Musire Vaanalu Munchunani
Ika Kasire Endalu Kaalchunani
Mari Musire Vaanalu Munchunani
Erugani Koyila Egirindhi
Erugani Koyila Egirindhi
Virigina Rekkala Origindhi
Nelaku Origindhi
Idhi Mallela Velayani
Idhi Vennela Maasamani
Thondarapadi Oka Koyila
Mundhu Koosindhi
Vindhulu Chesindhi
Marigi Poyedhi Maanava Hrudayam
Karuna Kaligedhi Challani Daivam
Marigi Poyedhi Maanava Hrudayam
Karuna Kaligedhi Challani Daivam
Vaade Lathaku Edhurai
Vachhu Vaadani Vasanthamaasam
Vasivaadani Kusuma Vilaasam
Idhi Mallela Velayani
Idhi Vennela Maasamani
Thondarapadi Oka Koyila
Mundhu Koosindhi
Vindhulu Chesindhi
Dhwaaraaniki Taaramanihaaram
Haarathi Vennela Karpooram
Dhwaaraaniki Taaramanihaaram
Haarathi Vennela Karpooram
Mosam Dhesham Leni Seemalo
Mosam Dhesham Leni Seemalo
Mogasaala Nilichenee Mandaram
Idhi Mallela Velayani
Idhi Vennela Maasamani
Thondarapadi Oka Koyila
Mundhu Koosindhi
Vindhulu Chesindhi
Oo Oho Oo Oo OooOo
Watch ఇది మల్లెల వేళయనీ Video Song
Idi Mallela Velayani Song Lyrics in Telugu
ఓ హో ఓఓ ఓ ఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓ ఓ
ఇది మల్లెల వేళయనీ
ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల
ముందే కూసిందీ… విందులు చేసిందీ
కసిరే ఎండలు కాల్చుననీ
ముసిరే వానలు ముంచునని
ఇక కసిరే ఎండలు కాల్చుననీ
మరి ముసిరే వానలు ముంచునని
ఎరుగని కోయిల ఎగిరిందీ
ఎరుగని కోయిల ఎగిరిందీ
విరిగిన రెక్కల ఒరిగిందీ
నేలకు ఒరిగింది
ఇది మల్లెల వేళయనీ, ఈ ఈ
ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల
ముందే కూసిందీ, ఈ ఈ
విందులు చేసిందీ
మరిగిపోయేది… మానవ హృదయం
కరుణ కలిగేది… చల్లని దైవం
మరిగిపోయేది… మానవ హృదయం
కరుణ కలిగేది… చల్లని దైవం
వాడే లతకు ఎదురై
వచ్చు వాడని వసంతమాసం
వసివాడని కుసుమ విలాసం
ఇది మల్లెల వేళయనీ
ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల
ముందే కూసిందీ, ఈ ఈ
విందులు చేసిందీ
ద్వారానికి తారామణిహారం
హారతి వెన్నెల కర్పూరం
ద్వారానికి తారామణిహారం
హారతి వెన్నెల కర్పూరం
మోసం ద్వేషం లేని సీమలో
మోసం ద్వేషం లేని సీమలో
మొగసాల నిలిచెనీ మందారం
ఇది మల్లెల వేళయనీ, ఈ ఈ
ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల
ముందే కూసిందీ, ఈ ఈ
విందులు చేసిందీ
ఓ ఓఓ ఓ ఓ హో ఓ ఓఓ ఓ
ఓ ఓఓ ఓ ఓ హో ఓ ఓఓ ఓ