వైజాగ్ టెస్టు: వైజాగ్ వేదికగా భారత్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 431 పరుగులకు (131.2 ఓవర్లు) ఆలౌట్ అయింది. 4వ రోజు 385/8తో మొదటి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన సౌతాఫ్రికా మొదటి సెషన్లో మరో 46 పరుగులు జోడించి మిగతా రెండు వికెట్లు కోల్పోయింది.
తమ మొదటి ఇన్నింగ్స్‌ని 502/7వద్ద డిక్లేర్ చేసిన భారత్ కు 71 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
డీన్ ఎల్గర్ 160 పరుగులు (287 బంతుల్లో 18×4, 4×6), డికాక్ 111 పరుగులు (163 బంతుల్లో 16×4, 2×6) సెంచరీలు సాదించారు.
టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఏడు వికెట్లతో సత్తా చాటారు. జడేజా రెండు, ఇషాంత్ ఒక వికెట్ చేజిక్కించుకున్నారు.
ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో మయాంక్ అగర్వాల్ (215), రోహిత్ శర్మ (176) శతకాలతో రాణించిన విషయం తెలిసిందే.