కటక్ వన్డే: విండీస్‌తో జరిగిన చివరి వన్డే ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఉత్కంట
పోరులో ఇంకా ఒక ఓవర్ (48.4 ఓవర్లలో) మిగిలి ఉండగానే 6 వికెట్లు చేజార్చుకొని 316 పరుగుల లక్షాన్ని చేధించింది కోహ్లీ సేన.
ఈ విజయంతో 2-1 తో కప్ గెలవడమే కాకుండా విండీస్‌పై భారత్ కు ఇది వరసగా 10వ సీరీస్ విజయం. 2006 నుండి వెస్టిండీస్ కు భారత్ మీద కప్ గెలవడం అందని ద్రాక్షలాగే మిగులుతూ వస్తుంది.
గత 5సంవత్సరాలలో కోహ్లీ 80 లో కాని 90 లో కాని ఔట్ అవడం ఇదే మొదటిసారి. ఈరోజు మ్యాచ్ లొ విరాట్ కొహ్లీ 85 (81 బంతుల్లో 9ఫోర్లు) పరుగులు చేసి జట్టును దాదాపు విజయతీరాలకు చేర్చి ఔటయ్యాడు.
ఫాస్ట్ బౌలర్ నవ్ దీప్ శైనీ ఈరోజు వన్డే మ్యాచ్ ద్వార భారత్ తరపున వన్డే మ్యాచ్ అరంగేట్రం చేశాడు.