India Target 185 – ICC Women’s T20 WC 2020. మహిళా వరల్డ్ కప్ ఫైనల్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 185 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ మహిళా జట్టు ముందు నుండి ధాటిగా ఇన్నింగ్స్ ను మొదలుపెట్టారు. ముఖ్యంగా ఓపెనర్లు అలీస్సా హీలీ, బెత్ మూని లు భారత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.
అలీస్సా హీలీ ఏకంగా 5 సిక్సులు, 7 ఫోర్ల సహాయంతో కేవలం 39 బంతుల్లో 75 పరుగులు చేసి మొదటి వికెట్ రూపంలో 115 పరుగుల వద్ద రాధా బౌలింగ్ లో అవుట్ అయింది. ఆ తరువాత కూడా బెత్ మూనీ తన బ్యాటింగ్ జోరును తగ్గించలేదు. 54 బంతుల్లో 78 పరుగులు (10*4) చేసి నాటౌట్ గా నిలించింది.
ఒక దశలో ఆసీస్ స్కోరు 200 దాటేలా కనిపించిన చివర్లో దీప్తి ఒకే ఓవర్లో రెండు వికెట్లు మరియు పూనమ్ ఒక వికెట్ తీయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 184 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కు నిర్దేశించింది.