సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే ఐపీఎల్ 2020 మ్యాచ్‌ల షెడ్యూల్. వివో ఐపీఎల్ 2020 (ఇండియన్ ప్రీమియర్ లీగ్) క్రికెట్ ఫీవర్
మరికొద్ది రోజుల్లోనే మొదలవుతుంది. ఎస్‌ఆర్‌హెచ్ ఆడే మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే ఐపీఎల్ 2020 మ్యాచ్‌ల షెడ్యూల్
ట్విట్టర్ వేధికగా అభిమానులతో ఆడే మ్యాచ్‌ల పూర్తి వివరాలు పంచుకుంది ఎస్‌ఆర్‌హెచ్. ఐపీఎల్ 2020 13వ సీజన్ మార్చి 29, 2020న ముంబై వేదికగా జరగనుంది. మే 24న ఫైనల్ జరగనుంది.
హైదరాబాద్ తన మొదటి మ్యాచ్ ను ముంబై ఇండియన్స్ తో ఏప్రిల్ 1, 2020న రాత్రి 8గం. లకు ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. చివరి మ్యాచ్ ని కోల్ కతా వేదికగా నైట్ రైడర్స్ తో మే 15, 2020న ఆడుతుంది.
సన్‌రైజర్స్ మొత్తం 14 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో 7 మ్యాచ్‌లు సొంత మైదానంలో మిగతా 7 మ్యాచ్‌లు ఇతర వేదికల మీద ఆడనుంది.
కొన్నేళ్లుగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తూ వస్తుంది. అదే ఊపును ఈ సీజన్‌లో కుడా కొనసాగించాలని చూస్తోంది. గత సీజన్లో, ప్లేఆఫ్‌లోకి ప్రవేశించినప్పటికీ ముందుకు సాగలేదు. ఈ జట్టులో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, రషీద్ ఖాన్, బెయిర్ స్టో మరియు భువనేశ్వర్ కుమార్ లాంటి స్టార్లతో బలంగా కనిపిస్తుంది.
ఈ సీజన్ విషయానికి వస్తే కొత్తగా ఇండియా అండర్-19 కెప్టెన్ ప్రియం గార్గ్, అల్ రౌండర్ మిచెల్ మార్ష్ మరియు ఫాబిన్ అలెన్ లు ఖచ్చితంగా అదనపు బలం.
ఈసారి ఐపీఎల్2020 లో హైదరాబాద్ మ్యాచ్‌ల పూర్తి టైం టేబుల్, షెడ్యూల్ వివరాలు క్రింది పట్టికలో చూడండి.
ఐపీఎల్ 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) టైం టేబుల్, షెడ్యూల్, వేదిక (SRH IPL 2020 Schedule)
మ్యాచ్ సంఖ్య
|
మ్యాచ్
|
తేదీ
|
వారం
|
సమయం (IST)
|
స్టేడియం
|
వేదిక
|
---|---|---|---|---|---|---|
1 | సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) Vs ముంబై ఇండియన్స్ (MI) | 01 ఏప్రిల్ 2020 | బుధవారం | 8:00 PM | ఆర్జీఐ క్రికెట్ స్టేడియం | హైదరాబాద్ |
2 | కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (KXIP) Vs సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) | 04 ఏప్రిల్ 2020 | శనివారం | 8:00 PM | పిసిఎ స్టేడియం | మొహాలి |
3 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) Vs సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) | 07 ఏప్రిల్ 2020 | మంగళవారం | 8:00 PM | చిన్నస్వామి స్టేడియం | బెంగళూరు |
4 | సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) Vs రాజస్థాన్ రాయల్స్ (RR) | 12 ఏప్రిల్ 2020 | ఆదివారం | సాయంత్రం 4:00 | ఆర్జీఐ క్రికెట్ స్టేడియం | హైదరాబాద్ |
5 | సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) Vs కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) | 16 ఏప్రిల్ 2020 | గురువారం | 8:00 PM | ఆర్జీఐ క్రికెట్ స్టేడియం | హైదరాబాద్ |
6 | చెన్నై సూపర్ కింగ్స్ (CSK) Vs సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) | 19 ఏప్రిల్ 2020 | ఆదివారం | 8:00 PM | ఎంఎ చిదంబరం స్టేడియం | చెన్నై |
7 | రాజస్థాన్ రాయల్స్ (RR) Vs సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) | 21 ఏప్రిల్ 2020 | మంగళవారం | 8:00 PM | సవాయి మాన్సింగ్ స్టేడియం | జైపూర్ |
8 | సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) Vs డిల్లీ క్యాపిటల్స్ (DC) | 26 ఏప్రిల్ 2020 | ఆదివారం | 8:00 PM | ఆర్జీఐ క్రికెట్ స్టేడియం | హైదరాబాద్ |
9 | సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) Vs చెన్నై సూపర్ కింగ్స్ (CSK) | 30 ఏప్రిల్ 2020 | గురువారం | 8:00 PM | ఆర్జీఐ క్రికెట్ స్టేడియం | హైదరాబాద్ |
10 | డిల్లీ క్యాపిటల్స్ (DC) Vs సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) | 3 మే 2020 | ఆదివారం | 8:00 PM | ఫిరోజ్ షా కోట్ల స్టేడియం | ఢిల్లీ |
11 | సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) | 5 మే 2020 | మంగళవారం | 8:00 PM | ఆర్జీఐ క్రికెట్ స్టేడియం | హైదరాబాద్ |
12 | ముంబై ఇండియన్స్ (MI) Vs సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) | 9 మే 2020 | శనివారం | 8:00 PM | వాంఖడే స్టేడియం | ముంబై |
13 | సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) Vs కింగ్స్ XI పంజాబ్ (KXIP) | 12 మే 2020 | మంగళవారం | 8:00 PM | ఆర్జీఐ క్రికెట్ స్టేడియం | హైదరాబాద్ |
14 | కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) Vs సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) | 15 మే 2020 | శుక్రవారం | 8:00 PM | ఈడెన్ గార్డెన్స్ స్టేడియం | కోలకతా |
SRH Tweet of Their Schedule, Time Table
🚨 ATTENTION #OrangeArmy🚨
The moment you’ve all been waiting for.
Mark your 🗓 for #IPL2020! pic.twitter.com/Z11JPXDvwu
— SunRisers Hyderabad (@SunRisers) February 15, 2020