Home » తాజా వార్తలు » వ్యభిచారంలో అడ్డంగా దొరికిన జబర్దస్త్ నటులు దొరబాబు పరదేశి అరెస్ట్

వ్యభిచారంలో అడ్డంగా దొరికిన జబర్దస్త్ నటులు దొరబాబు పరదేశి అరెస్ట్

ఎంతో మందికి జీవితం ఇస్తున్న జబర్దస్త్ షో నటులు దొరబాబు మరియు పరదేశిలు విశాఖపట్టణంలోని మాధవధారలోని ఓ అపార్ట్మెంట్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.

వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులతో పాటు విటులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ విటుల్లో జబర్దస్త్ షో హైపర్ ఆది స్కిట్ లో చేస్తున్న దొరబాబు మరియు పరదేశిలు కూడా పోలీసులకు చిక్కారు. తమను అరెస్ట్ చేయవద్దని పోలీసులను బ్రతిమలాడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తూర్పు గోదావరికి చి చెందిన దొరబాబు పరిశ్రమకి వచ్చి చాలా సంవత్సరాలైంది. మొదట్లో బి-గ్రేడ్ వీడియోల్లో నటించిన దొరబాబు తరవాత చిన్న చిన్న వేషాలు వేస్తూ జబర్దస్త్ షోలో ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 5 సంవత్సరాల నుండి జబర్దస్త్ చేస్తున్న దొరబాబు, హైపర్ ఆది సిక్స్ లో కీలక సభ్యుడు. నెల్లూరు పట్టణంలోని ఒక లోకల్ ఛానల్ లో పనిచేస్తున్న నందిని అనే యాంకర్ ను 2018 లో పెళ్లి చేసుకున్నాడు దొరబాబు.

ఆన్ స్క్రీన్ లోనే ఆఫ్ స్క్రీన్ లోను మనోడు ఏమాత్రం తీసిపోవడం లేదని సోషల్ మీడియాలో పంచ్ లు వేస్తున్నారు. హైపర్ ఆది వేసే పంచ్ లన్నీ దొరబాబు ఆఫ్ స్క్రీన్ లో నిజం చేస్తున్నాడని. ఇప్పుడు జరిగిన ఘటన మీద కూడా తన స్కిట్ లో హైపర్ ఆది పంచ్ లకు ఉపయోగించుకుంటాడని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

 

Scroll to Top