జాఫర్‌ ముఖాముఖి విత్ హైపర్ ఆది: సూటి పశ్నఆది నీకు సిగ్గుందా?

0
జాఫర్‌ ముఖాముఖి విత్ హైపర్ ఆది

జాఫర్‌ బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్స్‌గా తెలుగు వారికి సుపరిచతం. ఈ షోతో తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అక్కడితో
ఆగకుండా పలు టీవీ షోల్లో సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం టీవీ9 నుండి బయటికి వచ్చిన జాఫర్ టీవీ 5లో ముఖాముఖి కార్యక్రమాన్ని చేస్తున్నాడు.

జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది గతంలో ఒక మూవీ క్రిటిక్ మీద వ్యంగ్యాస్త్రాలు వేస్తూ అతని బాడీ మీద స్కిట్లు కూడా చేశాడు. అయితే
సద్దుమనిగిన ఆ గతాన్ని జాఫర్ మళ్లీ తవ్వాడు.

ఈటీవీ తెలుగులో ‘ఆడవారి పార్టీలకి అర్థాలే వేరులే’ అనే కార్యక్రమాన్ని కొత్త సంవత్సరం పురస్కరించుకొని డిసెంబర్ 31 రాత్రి 9.30 గంటలకు ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలను ఈటీవీ యూట్యూబ్ ద్వారా విడుదల వదులుతుంది.

తాజా ప్రోమోలో జాఫర్ ముఖాముఖి పేరుతో ఆది, రోజ మరియు సుడిగాలి సుధీర్ లను తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తుంది. ‘సూటి పశ్నఆది, — అనే వ్యక్తి బాడీ షేమింగ్ చేశారు. మీకు సిగ్గుందా’ అని జాఫర్ ప్రశ్నించగానే
అక్కడి పార్టిసిపెంట్స్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. దానికి హైపర్ ఆది వివరణ ప్రోమోలో ఇవ్వలేదు. కేవలం దానికి వివరణ ఇస్తున్నట్టు చూపించారు. మల్లెమాల ప్రొడక్షన్స్ నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ లో ఆది ఈ ప్రశ్నకు ఎలా స్పందించాడు, తన సమాధానం ఏంటో తెలియాలంటే 31 డిసెంబర్ వరకు ఆగాల్సిందే.

ప్రోమో మీరూ లుక్కేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here