ఎట్టకేలకు గాయ‌ని క‌నికా క‌పూర్‌కు కరోనా నెగెటివ్‌. బాలీవుడ్ గాయానికి ఊరట లభించింది. ఇప్పటికే నాలుగు సార్లు చేరిన టెస్టుల్లో కరోనా వైరస్ పాజిటివ్ గానే తేలింది. తాజాగా 5వ సారి చేసిన టెస్టులో కోవిడ్ 19 నెగెటివ్ గా రిపోర్టు వచ్చింది.

సంజ‌య్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ ఆసుప‌త్రి వర్గాలు ఈ విషయాన్ని తెలిపినట్టు ANI సంస్థ ట్విట్టర్ ద్వారా తెలిపింది.

అయితే ఆమెను వెంటనే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసే అవకాశాలు లేవు. మరొకసారి కరోనా వైరస్ టెస్ట్ చేసి అందులో కూడా నెగెటివ్ అని తేలితే అప్పుడు డిశ్చార్జ్ చేస్తారు.

లండన్ నుండి భారత్ కు వచ్చాక 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండమని కోరిన అందుకు విరుద్ధంగా నడుచుకొని పలు ఈవెంటుల్లో పాల్గొనడం వల్ల తన మీద కేసు కూడా నమోదయని విషయం తెలిసిందే.