Home » TV Show » కార్తీకదీపం జనవరి 18 ఎపిసోడ్ 708వ భాగం – మౌనిత షాక్, సౌర్య పంచులు

కార్తీకదీపం జనవరి 18 ఎపిసోడ్ 708వ భాగం – మౌనిత షాక్, సౌర్య పంచులు

బుల్లితెర సెన్సేషన్ ‘కార్తీకదీపం’ 708వ ఎపిసోడ్ లోకి ఎంటరయ్యింది. ఈ ఎపిసోడ్ కూడా వెటకారాలు, కామెడీ, పంచులు,
కోపాలతో సాగింది. జనవరి 18 (707 ఎపిసోడ్) లో ఏం జరిగిందో చూద్దాం.

చాలా భాదేసిందక్క…

Deepa E 708
Pic Credit: Star Maa & Hotstar

సీరియల్ మొదలవగానే దీప మొక్కలకు నీళ్ళు పడుతుంటుంది. అదే సమయానికి వారణాసి ఆటోలో వచ్చి కూరగాయలు ఇంట్లో పెట్టి భాదతో దీప దగ్గరకు వచ్చి అక్క.. అని పిలుస్తాడు. తరవాత…

దీప: అక్కా అని ఆగిపోయావేంట్రా, సౌర్యమ్మ ఎమైనా అందా, మేనకోడలు పాప ఎమైనా అందా !
వారణాసి: వాల్లెవరూ ఎమనలేదు. చెప్పొచ్చో లేదో తెలియదు కాని.. మౌనిత, డాక్టర్ బాబు కార్లో ఆనందంగా చేతులు కొట్టుకుంటూ వెళ్తున్నారు అక్క. వాళ్ళు అలా వెలుతుంటే నువ్వు, సౌర్యమ్మ గుర్తుకొచ్చి చాలా భాదేసింది అక్క.

ఇద్దరం వెళ్లి కడిగేద్దాం, వెళ్లి డాక్టర్ బాబును నిలదీద్దాంరా అక్క.. అని అమాయకంగా వారణాసి అనడంతో నువ్వు వెళ్ళు నేను మౌనితతో మాట్లాడతాను అని దీప చెప్తుంది. నువ్వు కిరాయి చూసుకో పో అని గద్దాయించడంతో చిన్నబుచ్చుకొని వారణాసి వెళ్తాడు.

కనిపించని నాన్న కోసం ఎక్కడ వెతుకుతావు…

KD E 708
Pic Credit: Star Maa & Hotstar

చిట్టితల్లి అనే కొత్త క్యారక్టర్ ఎంటర్ చేస్తాడు దర్శకుడు. నాకు అమ్మ లేదు, నాన్న ఉన్నాడని తెలిసింది, తన కోసం
వెతుకుతున్నాను అని హిమతో చెప్తుంది చిట్టితల్లి. అంతలో అక్కడికి చేరుకున్న సౌందర్య ఆ అమ్మాయి గురించి
తెలుసుకుంటుంది. కనిపించని నాన్న కోసం ఎక్కడ వెతుకుతావు, మీ నాన్న ఎలా ఉంటాడు అని అడిగిన సౌందర్యకు చిట్టితల్లి
చెప్పే సమాధానం విని ముచ్చటపడుతుంది. నువ్వేం టెన్షన్ పడకు ‘మన మనసు ఎదైతే బలంగా కోరుకుంటుందో అదే మన జీవితంలోకి వస్తుంది’ నీకేవసరం వచ్చినా నన్ను కలువు అని పాపకు చెప్పి హిమను తీసుకొని వెల్తుంది సౌందర్య.

విడాకుల విషయం హిమకు తెలిసిందా.. మౌనిత షాక్….!

KD 708 Maunita
Pic Credit: Star Maa & Hotstar

మౌనిత: ఏంటీ! విడాకుల సంగతి హిమకు తెలిసిపోయిందా!
కార్తీక్: హు.. ఎవరు చెప్పారో అర్దం అవడం లేదు.
మౌనిత: నాకర్థమైంది. విడాకులు విషయం హిమకు ఎవరు చెప్పారో.

ఎవరు చెప్పారు అని కార్తీక్ అడగగా, ఇంకెవరు చి.ల.సౌ వంటలక్క అని మౌనిత చెప్పగా. దీప చెప్పదు, అమ్మ మీద ప్రామిస్ చేసింది, దీప మా అమ్మ మీద ఒట్టేసినా, మా అమ్మ దీప మీద ఒట్టేసినా అబద్దం చెప్పరు అని కార్తీక్ చెప్పగానె ఆ అవునులే ఆ ఇద్దరూ నీ నెత్తి మీద చెయ్యి పెట్టీ కూడా నిజమే చెప్తారు అని మౌనిత బదులిస్తుంది. ఆ వెంటనే…

కార్తీక్: వెటకారమా..!
మౌనిత: అయ్యో నిజం.. నా మీదొట్టు. (వెటకారంగా)
కార్తీక్: అందుకే ఆ విషయం మర్చిపోవాలనే ఈరోజు బయటికి తీసుకుపోతానని చెప్పాను.
మౌనిత: ఎవరిని.. దీపనా! (మళ్లీ వెటకారంగా)
కార్తీక్: (కాస్త కోపంగా) హిమని, రెండు గంటలు అలా షాపింగ్ కి తిప్పి, రెస్టారెంట్ లో లంచ్ చేయిస్తాను.
మౌనిత: ఓ.. నన్ను కూడా రమ్మని పిలవడానికి వచ్చావా !
కార్తీక్: అబ్బె.. నువ్వు వస్తే హిమా అంతా కంఫర్టుగా ఫీల్ అవదు, వద్దులే
మౌనిత: (పిచ్చి కోపంతో) నువ్వు పిలిచినా రానులే, నాలుగైదు డెలివరీ కేసులున్నాయి.

మార్కెట్ లో బ్యాడ్ నేమ్ వస్తుంది, అందరికీ సిజేరియన్లు చేస్తున్నావట. కొంచెం చూసుకో, వస్తాను అని చెప్పి కార్తీక్ వెల్తుండగా ‘అసలెందుకు వచ్చావ్ కార్తీక్ చెప్పు’ అని అడుగుతుంది మౌనిత. దానికి..

కార్తీక్: నువ్వు ఈ మధ్య నన్ను, మా అమ్మను, హిమను అందరినీ పనిగట్టుకొని విమర్శించడం, వెటకారాలు చేయడం ఎక్కువగా చేస్తున్నావట. అవన్నీ తగ్గించుకొని నీ లిమిట్స్ లో నువ్వు ఉండు అని చెప్పడానికి వచ్చాను. అని చెప్పి వెల్తాడు కార్తీక్.

KD 708 S
Pic Credit: Star Maa & Hotstar

పట్టలేని కోపం, చిరాకుతో లేచి అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది మౌనిత. సరిగ్గా అదే సమయానికి ‘రాములో రాముల నన్నాగం చేసిందిరో’ పాట పాడుకుంటూ ఎంట్రీ ఇస్తుంది ప్రియమణి. అమ్మామా ఉల్లిపాయ రేటు తగ్గిపోయింది తెలుసా అని చెప్తుంటే కోపంలో గొంతు పట్టుకోవడానికి చేయి లేపి, పోవే అంటూ తన రూమ్ కి వెల్లి తలుపేసుకుంటుంది మౌనిత.

హిమ పరధ్యానం…

కార్తీక్, హిమను తీసుకొని కారులో బయటికి వెళ్తాడు. ఎందుకమ్మ అలా ఉన్నావు, జ్వరం తగ్గింది కదా, చెప్పు ఏ రెస్టారెంటుకు వెళ్దాం అని కార్తీక్ అనగానే ఏం లేదు డాడీ మీకు నచ్చిన రెస్టారెంటుకు తీసుకెళ్ళు, రెస్టారెంటు రాగానే లేపు అని పడుకుంటుంది హిమ.

హిమే మీ సొంత మనవరాలు…

Jan 18 KD
Pic Credit: Star Maa & Hotstar

సౌర్యకు స్కూల్లో అన్నం తినిపిస్తుంటుంది సౌందర్య. పక్కనే దీప కూడా కూర్చొని ఉంటుంది.

సౌర్య: నానమ్మ హిమ ఎందుకు రాలేదు?
సౌందర్య: వాళ్ల నాన్న దాన్ని బయటికి తీసుకుని వెళ్లాడే.

అని అనగానే కోపంగా లంచ్ బాక్స్ లాక్కొని అక్కడినుండి వెల్లబోతుండగా సౌందర్య ఆపి కారణం అడుగుతుంది.

సౌర్య: వాళ్ల నాన్న, మరి మా నాన్న ఎవరు? ఆ డాక్టర్ బాబు హిమకే నాన్నా? నాకు కాదా? మీరంతా ఒక్కటె, నన్ను మా అమ్మను మీరు కూడా వేరేగా చూస్తారని అర్థమవుతుంది. హిమే మీ సొంత మనవరాలు, నేను కాదు అంతేగా
దీప: నానమ్మ ఎప్పుడూ అలా అనుకోరు.
సౌర్య: ఇప్పుడనుకున్నారు కదా.. మేమే అనుకోవాలి అన్ని, మా నాన్న, మా నానమ్మ, మా తాతయ్య, మా చెల్లి అని, మీరు మాత్రం అనుకోరు. మా నాన్నేరి అని ఎవరిని అడిగినా చెప్పలేదు. నా అంతట నేను తెలుసుకున్నాను తప్ప మీకు మాత్రం చెప్పాలనిపించలేదు. అంటే ఎప్పటికీ మా అమ్మ వంటలక్క లాగే ఉండాలి, నేను వంటలక్క కూతురులాగే ఉండాలి.
సౌందర్య: ఒసేయ్.. ఒక్క వాక్యాన్ని పట్టుకొని అన్ని పేజీల వ్యాసం రాయకే. మిమ్మల్ని పరాయిలా ఎందుకు చూస్తానే.
సౌర్య: హిమకు ఎందుకు చెప్పలేదు? విడాకులు ఎవరికిస్తున్నారు మా నాన్న అని నన్ను అడిగితే వెళ్లి డాక్టర్ బాబునే అడగమని చెప్పాను.
సౌందర్య: ఒసేయ్.. చిచ్చర పిడుగా.. వాడి మీదకు ఉసిగొల్పింది నువ్వా?
సౌర్య: అవును మరి. డాక్టర్ బాబు విడాకులిచ్చేది మా అమ్మకే కదా. మరి ఆ మాట మీరే హిమకు చెప్పొచ్చు కదా. హిమ ఏడుస్తుంది. అందుకే స్కూలుకు వచ్చి ఉండదు.

KD Jan 18 Saurya
Pic Credit: Star Maa & Hotstar

ఇలా ఇంతపెద్ద మాటలు అనొచ్చ నానమ్మను అని దీప మందలించడంతో ‘అందుకే నేను నోరు మూసుకుని వెళ్లాలనుకున్నది నాన్నమ్మే ఆపారు’ అంటూ చెప్తుంది సౌర్య. పర్లేదులే నా మనవరాలే కద నన్ను అన్నది అని సౌందర్య బదులిస్తుంది. అన్నం మద్యలో అలా వెల్లకూడదు తినేసి వెళ్ళు అనగానే, అయితే హిమ వాల్ల అమ్మ ఎవరో చెప్పు నాన్నమ్మ అప్పుడు తింటాను అని కౌంటర్ ఇస్తుంది సౌర్య.

సౌర్య: చెప్పరు. మా అమ్మ చెప్పదు. మీరూ చెప్పరు. హిమకే చెప్పలేదు, మీరు నాకేం చెబుతారు? కానీ నేను ఊరుకోను. మా నాన్నెవరో తెలుసుకున్నట్లే హిమ వాళ్ల అమ్మెవరో నేనే కనిపెడతాను. మీరు దాచిపెట్టుకోండి అన్నీ నేను పోతున్నా.

రాక్షసిని కన్నాను…

సౌర్య అక్కడినుండి వెళ్లిపోగానే దీప మరియు సౌందర్య మాట్లాడుకుంటారు అక్కడే ఉండి.

సౌందర్య: ఇప్పుడు అది తిట్టిందా? అలిగిందా? కడిగి పారేసిందా? బెదిరించి పోయిందా? నాకేం అర్థం కావట్లేదేంటే?
దీప: అంతా మీ పోలికేగా? రాక్షసిని కన్నాను… కడిగి పారేసింది.. ఏంటో అంతా తెలిసి పోతూ ఉంటాయి… అమ్మగారికి.
సౌందర్య: అంతా నా పోలికే అంటూ రాక్షసిని కన్నాను అంటావేంటే… స్టుపిడ్. ఇవ్వాళ మీ తల్లీకూతుల్లిద్దరికి ఏమైందే
దీప: నాకు, దానికి ఒకటే బాధ. మీ సుపుత్రుడు నాకు విడాకులు ఇస్తానంటున్నాడని. ఈ పిల్లల దగ్గర మనం ఎన్ని విషయాలని దాచగలం అత్తయ్యా?
సౌందర్య: అదే నాకు అర్దం కావడం లేదే. ఈ ఇద్దరికి ఏం చెప్పాలో ఏం తెలియడం లేదు.

మన మొహాలకి నవ్వెందుకొస్తుందే…

దీప సౌందర్య 708
Pic Credit: Star Maa & Hotstar

దీప: పిల్ల మాటలేం మనసులో పెట్టుకోకండి.
సౌందర్య: పిల్లెవరున్నారే ఇక్కడ. ముదురే నీ కూతురు. దేశముదురు..నన్నే తప్పు పట్టింది. నా మనవరాలేగా, పోన్లే..

అని ఇద్దరూ నవ్వుకుంటారు. ఇంతలో….

సౌందర్య: అవునే మన మొహాలకి నవ్వెందుకొస్తుందే…
దీప: అవును అత్తయ్యా ఇది కూడా అర్థం కాని విషయమే

ఎందుకు అబద్దం చెబుతున్నాడు…

హిమ 708
Pic Credit: Star Maa & Hotstar

హిమను తీసుకొని కార్తీక్ రెస్టారెంటుకు వెళ్లి కూర్చుంటారు. ఇద్దరూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటారు.

హిమ: డాడీ ఎందుకు అబద్దం చెబుతున్నాడు?
కార్తీక్: ఎలా నిజం చెప్పాలి?
హిమ: డాడీ విడాకులు ఇచ్చేది ఎవరికి? అమ్మ బతికే ఉంది
కార్తీక్: ఆ వంటలక్కకు అని ఎలా చెప్పాలి?
హిమ: అమ్మ బ్రతికే ఉంది
కార్తీక్: అనాథని తెచ్చి పెంచుకున్నామని ఎలా చెప్పాలి?
హిమ: డాడీతో ఎలాగైనా నిజం చెప్పించాలి
కార్తీక్: హిమను ఈ టాపిక్ మరిచిపోయేలా చెయ్యాలి

ఇంతటితో 708వ ఎపిసోడ్ ముగుస్తుంది.

Scroll to Top