రవితేజ క్రాక్ సంక్రాంతి పోస్టర్ విడుదల – బుల్లెట్టు, బుల్లోడు, బుజ్జమ్మ

1
రవితేజ క్రాక్ పోస్టర్

రవితేజ క్రాక్ సంక్రాంతి పోస్టర్.. బుల్లెట్టు, బుల్లోడు, బుజ్జమ్మ

 

మాస్ మహారాజ రవితేజ తన తదుపరి చిత్రం “క్రాక్”. శృతీహాసన్ జంటగా రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని
దర్శకత్వం వహిస్తున్నాడు. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని క్రాక్ చిత్ర పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

పోస్టర్ లో శృతీహాసన్ బుల్లెట్ నడుపుతుండగా ఒక బుడతడు ముందు కూర్చొని ఉండగా హీరో రవితేజ రెండు చేతుల్లో రెండు స్టీలు క్యానులు పట్టుకొని వెనకాల కూర్చొంటాడు.

పోస్టర్ చూస్తుంటే రవితేజ భార్యగా శృతీహాసన్ నటిస్తున్నట్టు, వీరికి ఒక బాబు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే రవితేజ క్రాక్ చిత్రంలో పోలిస్ పాత్రలో కనిపించనున్నాడు.

దాదాపు 3 సంవత్సరాల గ్యాప్ తరవాత దర్శకుడు గోపీచంద్ (2017 లో ధరమ్ తేజ్ తో ‘విన్నర్’ సినిమా) క్రాక్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. రవితేజ మరియు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఇది మూడవ చిత్రం. గోపీచంద్
తన మొదటి సినిమా ‘డాన్ సీను’, మూడవ సినిమా ‘బలుపు’ ఇప్పుడు ఆరవ సినిమా ‘క్రాక్’ రవితేజ తో తీశాడు.

క్రాక్ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తుండగా, సరస్వతీ ఫిలిమ్స్ సంస్థ నిర్మాణ సారథ్యంలో బి మధు నిర్మిస్తున్నారు.
థియేటర్లలో సందడి చేయడానికి ఈ వేసవికాలంలో రానుంది క్రాక్ చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here