ఫ్లైట్‌ సిములేషన్‌ టెక్నిక్‌ సెంటర్‌ (ఎఫ్‌ఎస్‌టీసీ), ఇది దేశంలో ఉన్న ప్రధాన విమానయాన శిక్షణా సంస్థ. ఈ శిక్షణా కేంద్రాలు దేశంలో గురుగ్రామ్‌, హైదరాబాద్‌లో మాత్రమే ఉన్నాయి. అయితే శంషాబాద్ లో పైలట్ లకు ప్రాథమికంగా శిక్షణ ఇచ్చే ఎఫ్‌ఎస్‌టీసీ (FSTC) పైలట్‌ శిక్షణా కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు.

అనంతరం ఫ్లైట్ సిమ్యులేటర్ లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కొంచెంసేపు పైలట్‌ శిక్షణలో మెళుకువలు నేర్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్ లైన్ లో వైరల్ గా మారింది. పైలట్ సూచనలతో కేటీఆర్ కాసేపు గాల్లో చక్కర్లు కొట్టాడు.