Home » Jithender Reddy » Lachimakka Song Lyrics in Telugu & English – Jithender Reddy

Lachimakka Song Lyrics in Telugu & English – Jithender Reddy

by Devender

Lachimakka Song Lyrics penned by Rambabu Gosala from the Telugu film ‘Jithender Reddy’. లచ్చుమక్క అర్చనక్క పిల్ల సూడండే సిగ్గులల్ల సీతలెక్క సక్కగున్నాదే…

Lachimakka Song Credits

Movie Jithender Reddy (03 మే 2024)
Director Virinchi Varma
Producer Muduganti Ravinder Reddy
Singer Mangli
Music Gopi Sundar
Lyrics Rambabu Gosala
Star Cast Rakesh Varre, Vaishali Raj, Riya Suman
Music Label & Source

Lachimakka Song Lyrics in English

Lachumakka Archanakka Pilla Soodande
Siggulalla Seethalekka Sakkagunnaadhe
Manjulattha Sundarattha Pilladochhaade
Panchakatti Raamunole Manchigunnaade

Watch లచ్చుమక్క అర్చనక్క Lyrical Video Song

Lachimakka Song Lyrics in Telugu

లచ్చుమక్క అర్చనక్క పిల్ల సూడండే
సిగ్గులల్ల సీతలెక్క సక్కగున్నాదే
మంజులత్త సుందరత్త పిల్లడొచ్చాడే
పంచకట్టి రామునోలే మంచిగున్నాడే

పన్నెండు గుంజల్తో పందిర్నే వేయంగా
చుట్టాలే వచ్చేసి సందళ్ళే చేయంగా
వాకిట్లో వాసంతాలాడంగా

రామా సిలకా… గోరువంకా
ఈడు జోడు బాగుందమ్మా

ఏయ్, లచ్చుమక్క అర్చనక్క పిల్ల సూడండే
సిగ్గులల్ల సీతలెక్క సక్కగున్నాదే…

ఓ ఓ, దంచిరి పసుపు కొమ్ములు
పంచిరి ఆకు వక్కలు
సిరి గంధాలే సింగారించుకు
చేరిండ్రే ముత్తైదువులూ, ఊ ఊ

ఏసిరి గజ్జెల పీటలు
పోసిరి ముత్యపు రాశులు
పిల్లా జెల్లల అల్లరి తోడుగ
మోగే డోలు డప్పులు…

బంగారు బాషింగాలే నుదిటిన కట్టంగా
పరదాల చాటున జిలకర బెల్లం పెట్టంగా
ఒడినించి దీవించా
ఆ కుడుకా పండ్లు గుప్పిటవెట్టగా
రారే ఈ లగ్గం చేయంగా…

రామా సిలకా… గోరువంకా
ఈడు జోడు బాగుందమ్మా

రామా సిలకా… గోరువంకా
ఈడు జోడు బాగుందమ్మా.

You may also like

Leave a Comment