Home » Madeen SK » Malli Raake Pilla Love Failure Song Lyrics in Telugu

Malli Raake Pilla Love Failure Song Lyrics in Telugu

Malli Raake Pilla Love Failure Song Lyrics penned by Sai Prasad Poojari, music composed by Madeen Sk, and sung by Ramu & Jaya Sree, sequel of “Jagratha Pilla” song.

Malli Raake Pilla Love Failure Song Credits

DirectorShiva Veluthuru
ProducerJyothi Kunnuru
LyricsSai Prasad Poojari
SingersRamu & Jaya Sree
MusicMadeen SK
ArtistsJyothi Kunnuru, Bramarambika Tuthika
Song Lable

Malli Raake Pilla Love Failure Song Lyrics

investment

ఎందుకే ప్రేమ… నీకు నామీద ఆ కోపము
ఏమిటే ప్రేమా… నేను చేసిన ఆ పాపము

ఎందుకే ప్రేమ నీకు నామీద ఆ కోపము
ఏమిటే ప్రేమ నేను చేసిన ఆ పాపమూ

ప్రేమ వట్టి మాయని లోకమే
వేసిన ముద్రను చెరిపేద్దామనుకున్ననే
ప్రేయసంటె ఆ పంచభూతాల
కలయిక అంటూ చాటేద్దామనుకున్ననే
కన్నులల్ల నిలువెట్టుకుంటే
కోట్లిచ్చినా కోలుకోకుండా చేస్తివే

మళ్ళి రాకే పిల్లా
కన్నీళ్ళు కరువైనయే నా కన్నులల్ల
మళ్ళీ రాకు పిల్లా
బతుకంత బరువైనదే నీ ప్రేమ వల్ల

మళ్ళి రాకే పిల్లా
కన్నీళ్ళు కరువైనయే నా కన్నులల్ల
మళ్ళీ రాకు పిల్లా
బతుకంత బరువైనదే నీ ప్రేమ వల్ల

భూమి మీద నే పుట్టినందుకు
పుట్టి నిన్ను ప్రేమించినందుకు
పుట్టేడంత కోపమొస్తుందే
మొదటిసారి పిల్ల నామీద నాకు

అమ్మ లేక ఒంటరైనందుకు
జోలపాడే గొంతులేనందుకు
చచ్చి పోయే రోజుకై చూస్తున్న
ఎల్లి పోయే కోపంగ చూడకు
ఇన్నాళ్లు చేసిందే చాలే నాకు
ఇంతకన్న పెద్ద శిక్ష నాకెయ్యకు
కోటి దండాలు పెడుతానే నీ ప్రేమకు
వచ్చి కారణమవ్వకు నా చావుకు
కష్టమైన నే బతుకుతానే
కలలో కూడా నువ్వు నను సూడ రాకు

మళ్ళి రాకే పిల్లా
కన్నీళ్ళు కరువైనయే నా కన్నులల్ల
మళ్ళీ రాకు పిల్లా
బతుకంత బరువైనదే నీ ప్రేమ వల్ల

మళ్ళి రాకే పిల్లా
కన్నీళ్ళు కరువైనయే నా కన్నులల్ల
మళ్ళీ రాకు పిల్లా
బతుకంత బరువైనదే నీ ప్రేమ వల్ల

ఆశలెన్నో నే పెట్టుకుంటే
ప్రేమ కోవెల కట్టుకుంటే
ఓర్వలేదు రాత రాసినోడు
నిన్ను నేను గుండెలోదాసుకుంటే

కన్నులన్ని నిను కోరుకుంటే
నిన్ను సేరే దారే లేకుంటే
గొంతు పిసికి సంపినా బాగుండు
నాకిన్ని గోసలు పెట్టెడుకంటె

తప్పంతా నాదేరా మన్నించరా
కానీ నా కళ్ళ ముందేది జరగనీరా
ఆశతో చూస్తున్న నీదాన్నిరా
నువు లేకుంటే నేనెట్ల బతుకుతరా
చస్తే చస్తానేమో నీ చేతుల్లో
చచ్చేదాకైనా నీచెంతనుంటరా

జాగరత్త కన్నా..!
ఏడున్నా ఏలకు తింటూ
నువ్ మంచిగుండు
జాగ్రత్త కన్నా
ఈ పిచ్చి ప్రేమకు దూరంగా
నువ్ సల్లగుండు

జాగరత్త కన్నా..!
ఏడున్నా ఏలకు తింటూ
నువ్ మంచిగుండు
జాగ్రత్త కన్నా
ఈ పిచ్చి ప్రేమకు దూరంగా
నువ్ సల్లగుండు

Watch మళ్ళి రాకే పిల్లా Video Song

Scroll to Top