అఖిల్ అక్కినేని తన తదుపరి చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్’ షూటింగ్ వేగంగా జరుపుకుంటుంది. సినిమా ప్రమోషన్ ను
చిత్ర బృందం మొదలుపెడుతుంది. అందులో భాగంగా రేపు (02 మార్చి 2020) మొదటి లిరికల్ పాటను విడుదల చేయనున్నారు.
మనసా మనసా మొదటి సింగిల్
‘మనసా మనసా…’ పాటను మర్చి 2న ఉదయం 10:45కు విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించగా గోపి సుందర్ సంగీతాన్ని అందించారు.
బొమ్మరిల్లు భాస్కర్ చాలా కాలం తరువాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్’ కావడంతో అభిమానుల్లో
కాస్త ఉత్కంఠ ఉంది. అఖిల్ కు ఇది నాలుగవ చిత్రం, ఇది వరకు తీసిన మూడు చిత్రాలు (అఖిల్, హలో, మిస్టర్ మజ్ను)
బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడడమే కాకుండా ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేదు.
బన్నీ వాసు, వాసు వర్మ లు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ (GA 2) సమర్పిస్తుండగా అఖిల్ అక్కినేని సరసన పూజ హెగ్డే జత కడుతుంది.
Release Date of Most Eligible Bachelor Movie
Falsh: అయితే ‘మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్’ చిత్రం వేసవి కానుకగా 22 మే 2020న విడుదల కానున్నట్టు తెలుస్తుంది.