FROM THE 10TO5 LYRICS ARCHIVE

Mannimpu Song Lyrics from Kanguva Telugu Movie

Published: November 8, 2024

Category: Lyrics - Telugu

Mannimpu Song Lyrics

Song Lyrics

Mannimpu Song Lyrics కల్యాణ్ చక్రవర్తి అందించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి రఘు దీక్షిత్ పాడిన ఈ పాట సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘కంగువ’ చిత్రంలోనిది.

Mannimpu Song Credits

MovieKanguva (14.11.2024)
DirectorSiva
ProducersK.E. Gnanavelraja, Vamsi-Pramod
SingerRaghu Dixit
MusicDevi Sri Prasad
LyricsKalyan Chakravarthy
Star CastSuriya, Disha Patani, Bobby Deol
Music LabelSaregama Telugu

Mannimpu Song Lyrics

తననే తొలిచే మనుషులకే
దాహం తీర్చు నేల గుణం
తననే విరిచే చేతులకే
నీడై కాచే చెట్టు గణం

తననే తుంచే గాలులకే
గంధం పూసే పూలవనం
తననే వోలిచే ఉలి దెబ్బలకే
శిల్పం ఇచ్చే రాయితనం

మన్నింపు లేదంటే
ఈ లోకాన ఏది లేదులే
మన్నించే హృదయానికి
ఏ బాధ రాదులే

మన్నింపు లేదంటే
ఈ లోకాన ఏది లేదులే
మన్నించే హృదయానికి
ఏ బాధ రాదులే

కారడవిని కాల్చే చిచ్చువు కావా
పగతో ఉంటె నిత్యం
ఆ వేడిని దాటి వెలుగువు కావా
మన్నిస్తే కొంచెం

పడి తడబడుతూనే పొరబడుతూనే
నేర్చే మనుషుల నైజం
ప్రతి తప్పును పగతో దండిస్తే
ఇక మిగిలేది శూన్యం

ఏ నేరం ఎరుగని ఆకులను
కన్నీరుగా రాల్చే కాలం
మళ్ళీ తొలి చిగురులు ఇచ్చి
మాన్పేస్తుంది తను చేసిన గాయం

మన్నింపు లేదంటే
ఈ లోకాన ఏది లేదులే
మన్నించే హృదయానికి
ఏ బాధ రాదులే

మన్నింపు లేదంటే
ఈ లోకాన ఏది లేదులే
మన్నించే హృదయానికి
ఏ బాధ రాదులే

ఒక ఏనుగు కరిషం వేడిని చూసి
వెళ్ళిన దూరం చెబుతా
పులి వేసిన జాడల లోతును కొలిచి
బరువెంతో చెబుతా

ఒక్క నక్కే వేసే ఊలను వింటూ
ఆకలి ఎంతో చెబుతా
తూనీగలు ఎగిరే వేగంతో
వర్షం వైనం చెబుతా

ఒక చిన్న అలికిడితోనె
అడవంతా కనిపెడతానే
బిడ్డా నీ మనసును మాత్రం
అంతే చిక్కక వెతికేస్తున్నానే

మన్నింపు లేదంటే
ఈ లోకాన ఏది లేదులే
మన్నించే హృదయానికి
ఏ బాధ రాదులే

మన్నింపు లేదంటే
ఈ లోకాన ఏది లేదులే
మన్నించే హృదయానికి
ఏ బాధ రాదులే

Watch మన్నింపు లేదంటే Lyrical Video

💬 WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.