హీరో విజయ్ దేవరకొండ తన సొంత బ్యానరు (కింగ్ ఊఫ్ ద హిల్స్) లో తొలిసారి నిర్మిస్తున్న చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’ టీజర్ విడుదలైంది. ‘పెళ్ళిచూపులు’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.

ఇది వరకే ‘ఫలక్ నామా దాస్’ చిత్రం ద్వారా నటుడిగా తరుణ్ వెండి తెరకు పరిచయం అయ్యాడు.

68 నిమిషాల నిడివి గల ఈ టీజర్, హీరోను స్మోక్ చేస్తావా? మందు అలవాటుందా? గంజాయి, అమ్మాయిలూ వంటి ప్రశ్నలతో వాణి భోజన్ ఆరా తీస్తుంటుంది. అన్ని ప్రశ్నలకు ఛ ఛ ఛ.. నో నో నో.. అంటూ శ్రీరామ చంద్రుడిలా నాకేలాంటి చెడు అలవాట్లు లేవని చెప్తాడు.

ఫన్నీగా సాగే ఈ టీజర్ లో రంగమ్మత్త అనసూయ మాత్రం సీరియస్ పాత్రలో కనిపిస్తుంది.

ఇప్పటికే ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

షమ్మీర్ సుల్తాన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అవుతుండగా, శివకుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఆసక్తికరంగా సాగే టీజర్ మీకోసం, ఓ లుక్కేయండి.