Mellaga Mellaga Thatti Song Lyrics penned by Sirivennela Seetharama Sastry Garu, music composed by Deva Garu and sung by Chitra Garu from the Telugu cinema ‘Asha Asha Asha‘.
Mellega Mellega Thatti Song Credits
Asha Asha Asha Movie Released Date – 03 December 2002 | |
Director | Vasanth |
Producer | M.Balaji Nagalingam |
Singer | Chitra |
Music | Deva |
Lyrics | Sirivennela Seetharama Sastry |
Star Cast | Ajith, Suva Lakshmi |
Music Label |
Mellaga Mellaga Thatti Song Lyrics In English
Mellaga Mellaga Thatti… Meluko Melukomantu
Thoorupu Vechhaga Cheramgaa…
Sandhe Sooryude Sootigaa Vachhi… Chilipi Chempane Gichhi
Thalapulu Thalupu Thiyyamgaa
Egire Paavuram Theerugaa… Manase Ambaram Cheragaa
Kala Melukunnadhi… Ilaneluthunnadhi
Mellaga Mellaga Thatti… Meluko Melukomantu
Thoorupu Vechhaga Cheramgaa… Aa Aaa
Chit Chit Chit Chit… Chit Chit Chit
Chitipoti Pichika… Chithramgaa Egire Rekkala Evarichhaaru
Pat Pat Pat Pat Pat… Parugula Seethakoka
Padhahaaru Vannelu Neeku Evarichhaaru
Chinni Chinni Rekula Poolannee…
Aadukundhaam Rammannaayi Thalaloochi
Komma Meedhi Koyilamma… Nannu Choosee
Paaduthundhi Gonthu Kaastha Shruthi Chesi
Madhumaasamai Unte Edha… Santhoshame Kadhaa Sadhaa
Ammammaa… Aa Aaa, Mabbula Thalupulunna Vaakili
Theesi Rammantondhi… Ningi Logili
Mellaga Mellaga Thatti… Meluko Melukomantu
Thoorupu Vechhaga Cheramgaa… Aa Aaa
Thul Thul Thul Thul… Thul Thul Thul
Thulle Udatha Merupalle Urike Vegam Evarichhaaru
Jal Jal Jal Jal Jal… Jal Jal Paare Yeraa
Evarammaa Neekeeraagam Nerpinchaaru
Kondathalli Konakichhu Paalemo…
Nurugula Parugula Jalapaatham
Vaagu Mottham Thaage Dhaakaa…
Thaggadhemo Aashaga… Egire Pitta Dhaaham
Madhumaasamai Unte Edha… Santhoshame Kadha Sadhaa
Ammammaa… Aa Aa, Mabbula Thalupulunna Vaakili
Theesi Rammantondhi… Ningi Logili
Mellaga Mellaga Thatti… Meluko Melukomantu
Thoorupu Vechhaga Cheramgaa…
Sandhe Sooryude Sootigaa Vachhi… Chilipi Chempane Gichhi
Thalapulu Thalupu Thiyyamgaa
Egire Paavuram Theerugaa… Manase Ambaram Cheragaa
Kala Melukunnadhi… Ilaneluthunnadhi
Watch మెల్లగ మెల్లగ తట్టి Video Song
Mellaga Mellaga Thatti Song Lyrics In Telugu
నా న నా న నననా నా… తన నా న నా న నననా నా
నా న నా న నననా నా… తన నా న నా న నననా నా
మెల్లగ మెల్లగ తట్టి… మేలుకో మేలుకోమంటు
తూరుపు వెచ్చగ చేరంగా…
సందె సూర్యుడే సూటిగా వచ్చి… చిలిపిగా చెంపనే గిచ్చి
తలపులు తలుపులు తియ్యంగా
ఎగిరే పావురం తీరుగా… మనసే అంబరం చేరగా
కల మేలుకున్నది… ఇలనేలుతున్నది
మెల్లగ మెల్లగ తట్టి… మేలుకో మేలుకోమంటూ
తూరుపు వెచ్చగా చేరంగా… ఆఆ
చిట్ చిట్ చిట్ చిట్… చిట్ చిట్ చిట్
చిటిపొటి పిచిక… చిత్రంగా ఎగిరే రెక్కలు ఎవరిచ్చారు
పట్ పట్ పట్ పట్ పట్… పరుగుల సీతాకోకా
పదహారు వన్నెలు నీకు ఎవరిచ్చారు
చిన్ని చిన్ని రేకుల పూలన్నీ… ఆడుకుందాం రమ్మన్నాయి తలలూచి
కొమ్మమీది కోయిలమ్మ… నన్ను చూసీ
పాడుతుంది గొంతు కాస్త శృతి చేసి
మధుమాసమై ఉంటే ఎద… సంతోషమే కదా సదా
అమ్మమ్మా… ఆఆ, మబ్బుల తలుపులున్న వాకిలి
తీసి రమ్మంటోంది… నింగి లోగిలి
మెల్లగ మెల్లగ తట్టి… మేలుకో మేలుకోమంటూ
తూరుపు వెచ్చగా చేరంగా… ఆఆ
తుల్ తుల్ తుల్ తుల్… తుల్ తుల్ తుల్
తుల్లే ఉడత… మెరుపల్లే ఉరికే వేగం ఎవరిచ్చారు
జల్ జల్ జల్ జల్ జల్ జల్
జల పారే ఏరా… ఏవరమ్మా నీకీరాగం నేర్పించారు
కొండతల్లి కోనకిచ్చు పాలేమో… నురుగుల పరుగుల జలపాతం
వాగు మొత్తం తాగే దాకా… తగ్గదేమో ఆశగ ఎగిరే పిట్ట దాహం
మధుమాసమై ఉంటే ఎద… సంతోషమే కదా సదా
అమ్మమ్మా… ఆఆ, మబ్బుల తలుపులున్న వాకిలి
తీసి రమ్మంటోంది… నింగి లోగిలి
మెల్లగ మెల్లగ తట్టి… మేలుకో మేలుకోమంటు
తూరుపు వెచ్చగ చేరంగా…
సందె సూర్యుడే సూటిగా వచ్చి… చిలిపిగా చెంపనే గిచ్చి
తలపులు తలుపులు తియ్యంగా
ఎగిరే పావురం తీరుగా… మనసే అంబరం చేరగా
కల మేలుకున్నది… ఇలనేలుతున్నది
పా ప ప పా ప ప మ గ… మా మ మ మా మ మ గ రి
గా గ గ గా గ గ రి స రీ…
పా ప ప పా ప ప మ గ… మా మ మ మా మ మ గ రి
గా గ గ గా గ గ రి స రీ…