ఎంఐ నోట్ 10 త్వరలో లాంచ్ – 108 మెగాపిక్సల్ కెమెరాతో షావోమి సరికొత్త ఫోన్

ఎంఐ నోట్ 10 త్వరలో

ఎంఐ నోట్ 10 త్వరలో భారత్ లో విడుదల కానుంది. షావోమి ఈరోజు ఫోన్ కు సంబంధించి టీజర్ ద్వారా ఈ విషయాన్ని
వెల్లడించింది. తొలిసారిగా 108 మెగాపిక్సల్ కెమెరాతో షావోమి త్వరలోనే మార్కెట్లోకి విడుదుల చేస్తున్న ఈ ఫోన్ నెక్స్ట్-జనరేషన్ ఫోన్ అని చెప్పవచ్చు.

ఎంఐ నోట్ 10 ధర ఇండియాలో

చైనాలో ఒకరోజు ముందుగా విడుదల చేసిన టీజర్ సిసి 9 ప్రో కు గ్లోబల్ వెర్షనే ఎంఐ నోట్ 10 అని భావిస్తున్నారు. చైనాలో సిసి 9 ప్రో మిగతా దేశాల్లో మాత్రం ఎంఐ నోట్ 10 విడుదల కానుంది. పోటీ ప్రపంచంలో ముందుండేలా 108 పెంట కెమెరా ఫోన్ (ఐదు కెమెరాలు) కు సంబంధించిన టీజర్ ఫోన్ యొక్క పూర్తి వివరాలు ప్రకటించనప్పటికీ ఫోన్ ధర దాదాపుగా రూ.29,000 ఉంటాయని ఒక అంచనా. ఎంఐ నోట్ 10 త్వరలో.

ఎంఐ నోట్ 10 విడుదల తేదీ, ఖరీదు మొదలగు అంశాలు కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది. చైనాలో సిసి 9 ప్రో నవంబర్ 5న చైనాలో విడుదల కానుంది.

ఎంఐ నోట్ 10 కెమెరా వివరాలు

108-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 117 డిగ్రీల ఫీల్డ్ వ్యూ తో 20 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, టెలిఫోటో లెన్స్, మాక్రో కెమెరా మరియు 12 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ షూటర్. 10x హైబ్రిడ్ జూమ్ మరియు 50x డిజిటల్ జూమ్ సామర్థ్యం కలిగిందే టెలిఫోటో లెన్స్.

ఎంఐ నోట్ 10 ప్రత్యేకతలు (అనధికారికం)

ఓఎస్: ఆండ్రాయిడ్ వి 9.0 (పై)

డిస్ ప్లే: 6.5 ఇంచులు (16.51 సెం.మి)

ప్రాసెసర్: క్వాలకమ్ స్నాప్ డ్రాగన్ 730జి

ర్యామ్: 6 GB

మెమరీ: 128 GB

బ్యాటరి: 5170 mAh

వెనక కెమెరా: 108 మెగాపిక్సెల్ + 20 + 12 + 8 మెగాపిక్సెల్

సెల్ఫీ కెమెరా: 32 మెగాపిక్సెల్