బుల్లితెర వ్యాఖ్యాత శైలేష్‌ సన్ని మరియు ‘పెళ్లిచూపులు’ షో ఫేమ్ జ్ఞానేశ్వరి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్టర్ అండ్ మిస్’. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ట్రైలర్ ను లాంచ్ చేశాడు. ట్రైలర్ ను విడుదల చేస్తూ ‘సినిమా కంటెంట్ బాగుంటే ఎవ్వరూ ఆపలేరని, సినిమా మంచిదా చెడ్డదా’ అని మాత్రమే ఉంటాయని నాగ్ అశ్విన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

డైరెక్టర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ ‘నా స్నేహితుల్లో ఉన్న ఒక ప్రేమ జంటకు సంబంధించిన రియల్ స్టోరీనే సినిమాగా తీస్తున్న, వాళ్లిద్దరూ 6 సంవత్సరాలు ప్రేమించుకొని విడిపోయి వేరువేరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వారు కలిసి ఉన్నప్పుడు తీసుకున్న వీడియోలు బయటపడడంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతీ ఒక్కరిని ఆలోచింపజేసే చిత్రం అని’ చెప్పారు.

క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా నిర్మితమవుతున్న ‘మిస్టర్ అండ్ మిస్’ సినిమా ప్రస్తుతానికి నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చ్ నెలాఖరులో విడుదలకు సిద్దమవుతుంది.

మిస్టర్ అండ్ మిస్ ట్రైలర్